అసదుద్దీన్ ఓవైసీ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. తలాక్‌పై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దమని, కేవలం ముస్లిం మహిళలకు వర్తించే విధంగా ఆర్డినెన్స్ తీసుకురాడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇస్లాంలో వివాహం అనేది పూర్తిగా సివిల్ కాంట్రాక్టు. దానిలో శిక్షా నిబంధనలు పెట్టడం ఇస్లాంకు వ్యతిరేకం. దీని ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరగదు. దీనిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’’ అని ఓవైసీ పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లు లోకసభలో ఆమోదం పొంది.. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర కెబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసేందే. సుప్రీంకోర్టు ఉత్తర్వులు తరువాత కోర్టులో 430కిపైగా తలాక్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకే అత్యవస అర్డినెన్స్‌ను తీసుకువచ్చామని ప్రభుత్వం వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment