ముంపు గ్రామాల విలీనం దారుణం: హరీశ్ రావు
ముంపు గ్రామాల విలీనం దారుణం: హరీశ్ రావు
Published Fri, Jul 11 2014 11:00 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపు గురయ్యే మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయడం దారుణం అని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ వాటాను సాధించుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేస్తామన్నారు. జూరాల, పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకానికి త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి హరీశ్‌రావు వివరించారు.
పోలవరం ఆర్డినెన్స్‌కు శుక్రవారం లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఆమోదంతో ఖమ్మం జిల్లానుంచి కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూర్, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం మండలాలు ఆంధ్రప్రదేశ్ విలీనమయ్యాయి. బూర్గంపాడులో 15 గ్రామాలు మినహా, భద్రాచలం మండలంలో భద్రాచలం మినహా ఏపీలో విలీనమయ్యాయి. ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్ కు పలు పార్టీలు బంద్ ప్రకటించాయి.
Advertisement