'చంద్రబాబు చెప్పేది నీతులు.. తీసేది గోతులు'
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పేది నీతులు.. తీసేది గోతులని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఇలాగే మొండిగా ముందుకెళ్తే తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే దాని డిజైన్ను మాత్రం మార్చి తీరాల్సిందేనని హరీశ్ డిమాండ్ చేశారు. అపాయింటెడ్ డే అయిన జూన్ రెండో తేదీనే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని, అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలన్న విషయంలో కూడా కేసీఆర్దే తుది నిర్ణయమని ఆయన చెప్పారు.