న్యూఢిల్లీ: నగదు కొరత నేపథ్యంలో కేంద్రం జీతాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. పరిశ్రమలు, వ్యాపారాల్లో పనిచేసే వారికి జీతాలను చెక్కులు లేదా, ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చే వీలుంది. ‘ఈమేరకు 1936 నాటి వేతన చెల్లింపుల చట్టానికి సవరణ చేసేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చే వీలుంది. ఆ బిల్లును 15న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదించడానికి యత్నిస్తారు. మరో రెండు నెలలు వేచి ఉండేందుకు బదులు ఆర్డినెన్స్ తెచ్చి, ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదింపజేసుకోవచ్చు.’ అని అధికార వర్గాలు వెల్లడించాయి.