జారీ చేసిన కేంద్రం
డెహ్రాడూన్: ఏప్రిల్ 1 నుంచి ఉత్తరాఖండ్ ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ ద్రవ్య వినిమయ బిల్లు(ఓటాన్ అకౌంట్)కు సంబంధించిన ఆర్డినెన్స్‌ను గురువారం రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీఅయ్యాయి. పార్లమెంట్ సెషన్స్ లేకపోవడంతో... ఉత్తరాఖండ్ ఆర్థిక అవసరాల కోసం కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడంపై రాష్ట్రపతి సంతృప్తి చెందారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 2016-17 సంవత్సరానికి ఖర్చుల కోసం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర సంచిత నిధి నుంచి నిధులు తీసుకునేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపకరిస్తుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ ఖర్చుల కోసం రూ. 13,642.43 కోట్లు ఖర్చు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. కాగా, కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఉత్తరాఖండ్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 5లోగా స్పందించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 6న పిటీషన్‌పై తిరిగి విచారణ కొనసాగుతుంది. పార్లమెంటును ప్రొరోగ్ చేయడాన్ని వ్యతిరేకించే పిటిషన్‌ను కూడా జత చేసేందుకు రావత్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌కు కోర్టు అనుమతినిచ్చింది.
ఉత్తరాఖండ్ ఖర్చులకు ఆర్డినెన్స్
Published Sat, Apr 2 2016 2:55 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement