'ఆర్డినెన్స్లను ఆరెస్సెస్ కూడా వ్యతిరేకిస్తోంది' | rss also opposing central government ordinances, says ramachandraiah | Sakshi
Sakshi News home page

'ఆర్డినెన్స్లను ఆరెస్సెస్ కూడా వ్యతిరేకిస్తోంది'

Published Fri, Jan 23 2015 3:57 PM | Last Updated on Sat, Aug 18 2018 6:20 PM

'ఆర్డినెన్స్లను ఆరెస్సెస్ కూడా వ్యతిరేకిస్తోంది' - Sakshi

'ఆర్డినెన్స్లను ఆరెస్సెస్ కూడా వ్యతిరేకిస్తోంది'

కేంద్ర ప్రభుత్వ తీరు ఆర్డినెన్స్ల రాజ్యంగా మారిపోయిందని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. ఆరెస్సెస్ కూడా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్లను వ్యతిరేకిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చివరికి రాష్ట్రపతి సలహాలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని రామచంద్రయ్య ఆరోపించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏపీ అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలన్నారు.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవంటున్నా.. కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని రామచంద్రయ్య చెప్పారు. ఆర్థిక సంస్కరణలు కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలయ్యాయన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఘనతేనని రామచంద్రయ్య గుర్తుచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement