బుల్లితెరపై... | On the small screen ... | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై...

Published Fri, Jun 26 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

బుల్లితెరపై...

బుల్లితెరపై...

తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న కథానాయిక అమలాపాల్‌ను త్వరలో మనం బుల్లితెరపై చూడనున్నాం. చిత్ర దర్శకుడు విజయ్‌ను వివాహం చేసుకున్న అమలాపాల్ దాదాపుగా సినిమాలు తగ్గించేశారు.
 
 ఆమె నటించిన తమిళ చిత్రం ‘హైకూ’ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత మరే సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు తన దృష్టిని బుల్లితెర వైపు మళ్లించారు. ఓ తమిళ చానల్‌లో రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు.
 
 డాన్స్ నేపథ్యంలో సాగే ఈ రియాలిటీ షోకు స్వతహాగా డాన్సర్ అయిన అమలాపాల్ అయితే బాగుంటుందని, నిర్వాహకులు అనుకున్నారట. కాన్సెప్ట్ కూడా నచ్చి, ఆమె వెంటనే అంగీకరించారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement