అబుదాబి ఎయిర్ పోర్టులో నటుడి అరెస్ట్ | Malayali Actor Jinu Joseph arrests at Abudabi, shares via Facebook | Sakshi
Sakshi News home page

అబుదాబి ఎయిర్ పోర్టులో నటుడి అరెస్ట్

Published Fri, Apr 29 2016 10:00 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

అబుదాబి ఎయిర్ పోర్టులో నటుడి అరెస్ట్ - Sakshi

అబుదాబి ఎయిర్ పోర్టులో నటుడి అరెస్ట్

మళయాళ నటుడు జినూ జోసెఫ్ శుక్రవారం అబుదాబి ఎయిర్ పోర్టులో అరెస్టయ్యారు. ఈ విషయాన్ని ఆయనే తన ఫేస్ బుక్ అకౌంట్లో శుక్రవారం మధ్యహ్నం పోస్ట్ చేశారు. న్యూయార్క్ నుంచి అబుదాబికి ఎతిహాద్ విమానంలో బయల్దేరిన జినూ నిద్రపట్టడంలేదని టీవీ ఆఫ్ చేయాలని కోరగా అందుకు క్రూ సిబ్బందిలో ఒకరు నిరాకరించారు.

ఈ సందర్భంగా జినూ, సిబ్బంది మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సిబ్బందితో జరిగిన సంభాషణను జినూ తన మొబైల్ లో వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. దానిని సిబ్బంది అడ్డకోవడంతో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. జరిగిన సంఘటనపై సిబ్బంది ఫిర్యాదు చేయడంతో జినూను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

అబుదాబి ఎయిర్ పోర్టు పోలీసులు తనను అరెస్టు చేసినట్లు జోసెఫ్ ఆ తర్వాత ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఎతిహాద్ ఎయిర్ సర్వీస్ సరిగా లేవని, ప్రయాణ సమయంలో సిబ్బంది తనపై వివిక్ష చూపారని , ఈ విషయాన్ని మిగతా అందరికీ షేర్ చేయాలని అందులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement