Ethihad
-
జెట్ ఎయిర్వేస్కు భారీ ఊరట
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు భారీ ఊరట లభించింది. ఇప్పటికే సంస్థలో 25శాతం వాటా వున్న ఎథిహాద్ఎ యిర్‌వేస్ , జెట్‌లో వాటాల కొనుగోలుకు బైండింగ్ బిడ్ దాఖలు చేసింది. దీనిపై (టిపిజి కాపిటల్, ఇండిగో పార్టనర్స్, ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)) మొత్తం మూడు బిడ్లు దాఖలు కాగా ఎథిహాడ్‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్లోవాటా కొనుగోలుకు సంబంధించి బిడ్లను సమర్పించేందుకు గడువు మే 10 వ తేదీ సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పరిణామంపై మార్కెట్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దాదాపు మరో 6 వారాల్లో జెట్ విమానాలు మళ్లీ ఎగిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది ఇలా వుంటే జెట్ ఎయిర్వేస్ మూతతో రోడ్డున పడ్డ ఉద్యోగుల బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసారు. తమకు వేతనాలు తక్కువైనా పర్వాలేదు కానీ జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం మే 23 తరువాత ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు కంపెనీ ఉద్యోగులు ప్రధాన మంత్రి కలిసి సంస్థను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకూ జెట్ ఎయిర్వేస్ కోసం వాటాల విక్రయ ప్రక్రియను పర్యవేక్షించే అధికారమున్న ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు రెండు బిడ్లు వచ్చాయని ఎస్బీఐ ఛైర్మన్ రజ్నీష్ కుమార్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ షేరు ఢమాల్
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ఎయిర్ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో ఢమాల్ అంది. బీఎస్ఈలో ఎయిర్వేస్ షేర్లు రూ.215.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దాదాపు 6శాతం నష్టంతో రూ.215 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం 5శాతం నష్టంతో కొనసాగుతోంది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల కూరుకుపోయిన కంపెనీ నుంచి వైదొలగించేందుకు తన భాగస్వామ్య సంస్థ ఎతిహాత్ ప్రయత్నాలు చేస్తుంది. జెట్ ప్రివిలెజ్ వ్యాపార విభాగంలో తనకున్న 50.1 శాతం వాటాలను కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు ఆఫర్ చేసినట్లు సమాచారం. షేరు ఒక్కింటికి రూ. 150 చొప్పున జెట్‌లో తమకున్న 24 శాతం వాటాలను రూ. 400 కోట్లకు అమ్మేసేందుకు ఎస్బీఐకి ఎతిహాద్ ఆఫర్ చేసినట్లు మంగళవారం వార్తలు వెలువడ్డాయి. ఫలితంగా నేడు జెట్ ఎయిర్వేస్ ధర గత ముగింపు(రూ.229) తో పోలిస్తే దాదాపు 6శాతం నష్టంతో రూ.215 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకే మొగ్గుచూపడంతో షేరు 7శాతం నష్టపోయి రూ.213.95ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:40ని.లకు షేరు గత ముగింపు(రూ.229.05) ధరతో పోలిస్తే షేరు ధర 5శాతం నష్టపోయి రూ.217.50ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.163.00 రూ.708.15లుగా నమోదయ్యాయి. -
అబుదాబి ఎయిర్ పోర్టులో నటుడి అరెస్ట్
మళయాళ నటుడు జినూ జోసెఫ్ శుక్రవారం అబుదాబి ఎయిర్ పోర్టులో అరెస్టయ్యారు. ఈ విషయాన్ని ఆయనే తన ఫేస్ బుక్ అకౌంట్లో శుక్రవారం మధ్యహ్నం పోస్ట్ చేశారు. న్యూయార్క్ నుంచి అబుదాబికి ఎతిహాద్ విమానంలో బయల్దేరిన జినూ నిద్రపట్టడంలేదని టీవీ ఆఫ్ చేయాలని కోరగా అందుకు క్రూ సిబ్బందిలో ఒకరు నిరాకరించారు. ఈ సందర్భంగా జినూ, సిబ్బంది మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సిబ్బందితో జరిగిన సంభాషణను జినూ తన మొబైల్ లో వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. దానిని సిబ్బంది అడ్డకోవడంతో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. జరిగిన సంఘటనపై సిబ్బంది ఫిర్యాదు చేయడంతో జినూను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అబుదాబి ఎయిర్ పోర్టు పోలీసులు తనను అరెస్టు చేసినట్లు జోసెఫ్ ఆ తర్వాత ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఎతిహాద్ ఎయిర్ సర్వీస్ సరిగా లేవని, ప్రయాణ సమయంలో సిబ్బంది తనపై వివిక్ష చూపారని , ఈ విషయాన్ని మిగతా అందరికీ షేర్ చేయాలని అందులో పేర్కొన్నారు.