సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు భారీ ఊరట లభించింది. ఇప్పటికే సంస్థలో 25శాతం వాటా వున్న ఎథిహాద్ఎ యిర్‌వేస్ , జెట్‌లో వాటాల కొనుగోలుకు బైండింగ్ బిడ్ దాఖలు చేసింది. దీనిపై (టిపిజి కాపిటల్, ఇండిగో పార్టనర్స్, ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్)) మొత్తం మూడు బిడ్లు దాఖలు కాగా ఎథిహాడ్‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్లోవాటా కొనుగోలుకు సంబంధించి బిడ్లను సమర్పించేందుకు గడువు మే 10 వ తేదీ సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పరిణామంపై మార్కెట్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దాదాపు మరో 6 వారాల్లో జెట్ విమానాలు మళ్లీ ఎగిరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇది ఇలా వుంటే జెట్ ఎయిర్‌వేస్ మూతతో రోడ్డున పడ్డ ఉద్యోగుల బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసారు. తమకు వేతనాలు తక్కువైనా పర్వాలేదు కానీ జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం మే 23 తరువాత ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు కంపెనీ ఉద్యోగులు ప్రధాన మంత్రి కలిసి సంస్థను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకూ జెట్ ఎయిర్వేస్ కోసం వాటాల విక్రయ ప్రక్రియను పర్యవేక్షించే అధికారమున్న ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు రెండు బిడ్లు వచ్చాయని ఎస్‌బీఐ ఛైర్మన్ రజ్నీష్ కుమార్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment