మలయాళ నటుడు బాల (బాలకుమార్) మూడో పెళ్లి చేసుకున్నాడు. పదిరోజుల క్రితం తన మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో పాటు కూతురు అవంతికను వేదించాడని ఆమె ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో అరెస్ట్ అయిన 24గంటల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఈ క్రమంలో తాజాగా మూడో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు.
'బాల' మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. 'కంగువ' సినిమా దర్శకుడు శివకు స్వయాన తమ్ముడు అవుతాడు. కొద్దిరోజుల క్రితమే బెయిల్ మీద బయటకొచ్చిన బాల.. మూడో పెళ్లి చేసుకుని తన భార్యతో కేరళలోని కలూర్ పావకులం ఆలయానికి వచ్చాడు. తమిళనాడుకు చెందిన తన బంధువు కోకిలను ఆయన వివాహం చేసుకున్నాడు. అయితే, ఇరుకుటుంబాల మధ్య మాత్రమే ఈ కార్యక్రమం జరిగింది. పెళ్లి గురించి బాల ఇలా చెప్పుకొచ్చాడు. కోకిల తన మామయ్య కూతురని వెళ్లడించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు చిరకాల కోరిక ఉండేదని అన్నాడు. ఇలా ఆమె కోరిక నెరవేరిందని బాల చెప్పాడు. 'కష్ట సమయంలో కోకిల మాత్రమే నాకు మద్దతుగా నిలిచింది. నేను మళ్లీ పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావడానికి ఆమె కారణం.' అని చెప్పాడు.
బాల గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతని మొదటి వివాహం 2010లో గాయని అమృత సురేష్‌తో జరిగింది. ఈ జంటకు అవంతిక అనే కుమార్తె ఉంది. వారు 2019లో విడాకులు తీసుకున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఎలిజబెత్ ఉదయన్‌ను 2021లో రెండోసారి వివాహం చేసుకున్నాడు. 2023లో వారిద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. విడాకులు ఇచ్చి కూడా తనను వేదిస్తున్నాడని కేసు పెట్టిన మొదటి భార్య కోర్టులో న్యాయపోరాటం చేస్తుంది. కూతురు అవంతికతో పాటు తనను కూడా సోషల్‌మీడియాలో దారుణంగా తిడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసు విచారణలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment