
నటుడు నవజీత్ నారాయణ్
నటీమణుల కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు దాదాపు అన్ని భాషల ఇండస్ట్రీల్లో వెలుగు చూస్తున్నాయి. అయితే కేవలం హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలోనే కాదని, మేల్ ఆర్టిస్టులకు కూడా వేధింపులు తప్పటం లేదని ఓ యువనటుడు ఆరోపిస్తున్నాడు. మాలీవుడ్‌కు చెందిన నవజీత్ నారాయణ్ అనే టాలెంటెడ్ హీరో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. ఓ చిత్రం సందర్భంగా దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును అతను వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్న రోజులవి. ఒకరోజు సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని ఓ దర్శకుడు ఆఫీస్‌కు రమ్మన్నాడు. తీరా అక్కడికెళ్లాక గదిలోకి రమ్మని తేడాగా ప్రవర్తించాడు. నా తొడలపై చెయ్యేసి, ప్యాంట్ లోపలికి చెయ్యి పోనిచ్చాడు. నాకు చిర్రెత్తుకొచ్చి అతని మీద అరిచా. లాగి గూబ మీద ఒక్కటి పీకా. ఆపై ఆ దర్శకుడికి వార్నింగ్ కూడా ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశా. తర్వాతే తెలిసింది అతనో హోమో సెక్సువల్ అని.. ఇండస్ట్రీలో మహిళలకే కాదు.. మేల్ ఆర్టిస్టులకు కూడా రక్షణ లేదు’ అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఆ దర్శకుడు ఎవరన్న విషయం చెప్పేందుకు అతను నిరాకరించాడు.
మరోవైపు భోజ్‌పురి స్టార్ హీరో, పలు తెలుగు చిత్రాల్లో నటించిన రవికిషన్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే పురుషుల నుంచి కాకుండా మహిళల నుంచే మేల్ ఆర్టిస్టులకు వేధింపులు జరుగుతున్నాయని ఆయన చెప్పటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment