
ఎస్ దుర్గ చిత్రంలోని ఓ దృశ్యం
సాక్షి, తిరువనంతపురం : టైటిల్‌తో వివాదంలో నిలిచిన చిత్రం ‘ఎస్ దుర్గ’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైపోయింది. మార్చి 23న చిత్రం కేరళలో విడుదల కానుంది. సెక్సీ దుర్గ, న్యూడ్.. కధేంటి?
సోమవారం సాయంత్రం ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. సీనియర్ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ చేతుల మీదుగా క్యాంపెయిన్‌ను చిత్ర దర్శకుడు సనాల్ కుమార్ శశిధరన్ మొదలుపెట్టాడు. చిత్రంలోని చిన్న చిన్న వీడియో బైట్‌లతో ఆయా వాహనాలు సినిమా గురించి రాష్ట్రం మొత్తం ప్రమోషన్ చేస్తాయి.
ఇక సెక్సీ దుర్గ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డుల వేడుకల్లో(లండన్, హాంకాంగ్ తదితర) ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. అయితే టైటిల్ కాస్త అభ్యంతరకరంగా ఉందంటూ ఇఫ్ఫీ వేడుకల జాబితా నుంచి ఆ చిత్రాన్ని తొలగించారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. బోర్డు వ్యవహారాన్ని తప్పుబడుతూ పలు భాషల నటీనటులు చిత్ర మేకర్లకు అండగా నిలిచారు. ఆపై సినిమా పేరును ఎస్ దుర్గగా మారుస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
అయినప్పటికీ సెన్సార్ బోర్డు కూడా చిత్ర విడుదలకు అభ్యంతరం తెలిపింది. చివరకు ఆందోళనల నేపథ్యంలో తగ్గిన బోర్డు సినిమాకు U/A సర్టిఫికెట్ ఇస్తూ రీలీజ్‌కు అనుమతించింది. అర్ధరాత్రి ఓ యువతి ఎదుర్కున్న పరిస్థితుల నేపథ్యంలో ఎస్ దుర్గ చిత్రం తెరకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment