
తెలుగు హీరోలు ప్రస్తుతం తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా మలయాళంలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. మిగతా టాలీవుడ్ హీరోలు కూడా తమ చిత్రాలను ఇతర భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం అదే కోవలో చేరారు. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం మాలీవుడ్ లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
గతేడాది బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్ ప్రొడక్షన్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభియానంతో ఆకట్టుకున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ నటించిన మూడు పాత్రల్లోకెల్లా రావణ పాత్రకు విశేషమైన స్పందన రావడంతో నిర్మాత బి ఉన్ని కృష్ణన్ ఆ పేరు వచ్చేలాగా ‘రావణసూరన్’గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.