ఫ్యాక్షన్‌ జానర్‌లో ఎన్టీఆర్‌..! | Jr NTR Next Set In Faction Backdrop | Sakshi
Sakshi News home page

Published Wed, May 2 2018 11:21 AM | Last Updated on Wed, May 2 2018 1:14 PM

Jr NTR Next Set In Faction Backdrop - Sakshi

జై లవ కుశ సినిమా తరువాత గ్యాప్‌ తీసుకున్న యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్‌ జానర్‌ లో రూపొందుతోందట.

సీనియర్‌ నటులు నాగబాబు, జగపతి బాబు ప్రత్యర్థులైన ఫ్యాక్షన్‌ లీడర్‌లుగా కనిపిస్తారని తెలుస్తోంది. అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్‌ తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్‌ సరసన తొలిసారిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్రయిన్‌ అయిన ఎన్టీఆర్‌ కొత్త లుక్‌లో డిఫరెంట్‌ మేకోవర్‌లో దర్శనమిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement