
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నిర్మాత గాంధీమతి బాలన్ (66) కన్నుమూశారు. 1980ల్లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన ఆయన గాంధీమతి పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
మలయాళంలో 'సుఖమో దేవి', 'పంచవడి పాలం' 'తూవనతుంబికల్', మూన్నం పక్కం, నంబరతి పూవు, సుఖమో దేవి, ఇదిరి నేరమ్ ఒతిరి కార్యం వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. బాలన్ కేవలం ఇరవై ఏళ్ళ వయసులో నిర్మాతగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. మలయాళంలో నిర్మాతగా దాదాపు 33 చిత్రాలు నిర్మించారు. కొన్నేళ్ల క్రితం బాలన్ తన కుమార్తెతో కలిసి సైబర్-ఫోరెన్సిక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు.