malayalam producer
-
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నిర్మాత గాంధీమతి బాలన్ (66) కన్నుమూశారు. 1980ల్లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన ఆయన గాంధీమతి పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మలయాళంలో 'సుఖమో దేవి', 'పంచవడి పాలం' 'తూవనతుంబికల్', మూన్నం పక్కం, నంబరతి పూవు, సుఖమో దేవి, ఇదిరి నేరమ్ ఒతిరి కార్యం వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. బాలన్ కేవలం ఇరవై ఏళ్ళ వయసులో నిర్మాతగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. మలయాళంలో నిర్మాతగా దాదాపు 33 చిత్రాలు నిర్మించారు. కొన్నేళ్ల క్రితం బాలన్ తన కుమార్తెతో కలిసి సైబర్-ఫోరెన్సిక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. -
లైంగిక దాడి కేసు: బాధితురాలి పేరు వెల్లడి, విజయ్ బాబు అరెస్ట్
మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌బాబు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని విజయ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవల ఓ యువ నటి, మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై కేసు నమోదు చేశారు. తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కొన్ని నెలల క్రితం విజయ్ బాబుపై కేసు నమోదు కాగా కేరళ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందాడు. చదవండి: బన్నీ షాకింగ్ లుక్ వైరల్, దారుణంగా ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు అయితే నిబంధనలకు విరుద్ధంగా అతడు ఇటీవల సోషల్ మీడియాలో బాధిత నటి పేరును వెల్లడించాడు. దీంతో తాజాగా పోలీసులు అతడిని అరెస్టు చేయగా ఆ వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే జూలై 3వ తేదీ వరకు విజయ్ బాబను ప్రశ్నించడానికి హైకోర్టు పోలీసులు అనుమతి ఇచ్చింది. -
లైంగిక ఆరోపణలు, విజయ్ బాబు షాకింగ్ నిర్ణయం
AMMA Removes Vijay Babu From Executive Committee: మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌బాబు వరుసగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. విజయ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవల ఓ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం మాలీవుడ్ పరిశ్రమలో సంచలనంగా మారింది. దీనిపై చర్చ జరుగుతుండగానే మరో మహిళ విజయ్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. పరిచమైన అరగంటలోనే తన పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడంటూ శుక్రవారం ఆమె ఫేస్బుక్ వేదికగా వెల్లడించింది. దీంతో పరిశ్రమలో ఆమె ఆరోపణలు మరింత హాట్‌టాపిక్‌గా నిలిచాయి. చదవండి: మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు ఇదిలా ఉంటే అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ కమిటి నుంచి విజయ్ బాబును తొలిగించినట్లు తాజాగా ప్రకటన వెలువడింది. తాత్కలికంగా విజయ్ బాబు సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు 5 మంది సభ్యులతో కూడిన ఇంటర్నల్ కమిటీ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించింది. కాగా లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ తాను అమ్మ నుంచి తప్పుకుంటానని నటుడు విజ్ఞప్తిని మన్నించి అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినందున తన కారణంగా అసోసియేషన్ ప్రతిష్ట దెబ్బతినరాదనే ఉద్దేశంతో తనను అమ్మ నుంచి తాత్కాలికంగా తొలగించాలని విజయ్ బాబు అసోసియేషన్‌కు లేఖ రాశాడు. చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ కొచ్చిలో జరిగిన సంస్ధ కార్యవర్గ సమావేశంలో విజయ్ బాబును ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని అమ్మ ప్రధాన కార్యదర్శి ఎడవెల బాబు తెలిపారు. మరోవైపు విజయ్ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన మళయాళ సినీ పరిశ్రమ స్పందించకపోవడాన్ని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) ప్రశ్నించింది. అసోసియేషన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి మాల పార్వతి అసోషియేషన్‌కు రాజీనామా చేసింది. విజయ్ బాబు లైంగికంగా ఇబ్బంది పెట్టాడన్నది నిజమని, స్యయంగా బాధితురాలే ఈ విషయం వెల్లడించిందన్నారు. దీంతో అతడు తప్పుచేశాడన్నది రుజువైందన్నారు. కానీ దీనిపై అమ్మ అతడికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. అతనే సభ్యత్వానికి రాజీనామ చేయమని చెప్పడం, కమిటీ అతడిని తప్పుకోమని చెప్పడంలో చాలా తేడా ఉందని ఆమె పేర్కొంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1701356058.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు
మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌బాబు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవలే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో మహిళ విజయ్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని శుక్రవారం ఫేస్బుక్లో రాసుకొచ్చింది. 'నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం హౌస్ యజమాని విజయ్‌బాబును 2021 నవంబర్‌లో ఒకసారి కలిశాను. అది కూడా వర్క్ గురించి మాట్లాడేందుకే! మేమిద్దరం ప్రొఫెషనల్ విషయాల గురించి చర్చించుకున్నాం, ఆ తర్వాత వ్యక్తిగత సమస్యల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ మాటల్లో నాకు సహాయం అవసరమని గుర్తించాడు. మందు తాగుతూ నన్నూ తాగమని కోరితే వద్దని చెప్పాను. ఇంతలో సడన్‌గా నా పెదాలపై ముద్దు పెట్టాడు. అతడు చేసిన పనికి షాకైన నేను క్షణాల్లో దూరం జరిగాను' 'అయినా సరే అతడు ఇంకొక్క ముద్దు పెడతా? అని అడిగాడు. కుదరదని చెప్పేశాను. దీంతో అతడు నాకు సారీ చెప్పి దయచేసి ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని బతిమాలాడు. నాక్కూడా భయమేసి సరేనని తలూపాను. ఆ రూమ్‌లో నుంచి బయటకు వచ్చేశాను. కానీ అతడు అలా చీప్‌గా ప్రవర్తించడంతో భయపడిపోయాను. ఈ ఒక్క సంఘటనతో నేను నా వర్క్‌ను మధ్యలో ఆపేశాను. మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న నా కలను అక్కడితోనే తుడిచేశాను. తొలిసారి కలిసిన 20- 30 నిమిషాల్లోనే అతడు అలా అసభ్యంగా ప్రవర్తించాడంటే విజయ్‌బాబు వల్ల ఎంతమంది అమ్మాయిలు ఎన్ని బాధలు అనుభవించారో అర్థం అవుతుంది..' చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో రాధేశ్యామ్ హిందీ వర్షన్, ఎప్పటినుంచంటే? 'ఇటీవలే ఓ నటి తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టిన వార్తను చదివినప్పుడు నేను కూడా ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనిపించింది. ఆమె ఎంత నరకం అనుభవించిందో నేను అర్థం చేసుకోగలను. కొందరు ఆ మహిళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ అక్కడున్న మనిషి ఎలాంటివాడో నాకు తెలుసు. సహాయం పేరుతో అమ్మాయిలను వాడుకోవాలనుకునే దుర్మార్గుడతడు. ఇలాంటివాళ్లను శిక్షించి 'ఇండస్ట్రీ అమ్మాయిలకు అంత మంచిది కాదు' అనే అపోహను తుడిచిపెట్టేలా చేయాలి' అని రాసుకొచ్చింది. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీ శ్వేత వర్మకు చేదు అనుభవం, సినిమా ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి.. -
టిక్కెట్టు లేకుండా సినిమా!!
సినిమాకు వెళ్లి, టిక్కెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఎంచక్కా చూస్తే ఎలా ఉంటుంది? దొంగదారిలో వెళ్దామనుకుంటున్నారా.. అక్కర్లేదు. ఓ మళయాళ నిర్మాత చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే భవిష్యత్తులో చాలావరకు సినిమాలను ఉచితంగానే చూడొచ్చు. కనీసం మొదటి వారం వరకైనా కూడా సినిమాను ఉచితంగా ప్రేక్షకులకు అందించాలని ఆ నిర్మాత ప్రయత్నం చేస్తున్నారు. ఎస్.వినోద్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'టెస్ట్ పేపర్' అనే సినిమాను ఇలా ఉచితంగా అందించాలని ఆ సినిమా నిర్మాత మనోజ్ కుమార్ భావిస్తున్నారు. అయితే, ఇది ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే. ముందుగా థియేటర్ల వద్ద ఇచ్చే ఉచిత పాస్‌లు తీసుకుని ఈ సినిమాకు వెళ్లాలి. సినిమా ప్రదర్శనకు అయ్యే ఖర్చులను ప్రకటనల ద్వారా రాబడతామని నిర్మాత మనోజ్ కుమార్ చెప్పారు. ఇంతకుముందు టీవీ సీరియళ్లు, కార్యక్రమాలు రూపొందించామని, కానీ సినిమాను ఇలా స్పాన్సర్ చేయించడం మాత్రం భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి అవుతుందని ఆయన అన్నారు. పెద్దపెద్ద బ్రాండ్ల కంటే స్థానిక ప్రకటనల మీదే తాము దృష్టి పెట్టామన్నారు. సీరియళ్లలో అయితే ఎప్పుడు పడితే అప్పుడే మధ్యలో ప్రకటనలు వస్తాయి. కానీ సినిమాలో మాత్రం అలా కాకుండా, మొదట్లోను, ఇంటర్వెల్ సమయంలోను మాత్రమే ప్రకటనలు ఇస్తారు. టెస్ట్ పేపర్ సినిమాలో జగదీష్, నందు, మున్నా, మహాలక్ష్మి లాంటి ప్రముఖ నటులున్నారు.