AMMA Removes Vijay Babu From Executive Committee: మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌బాబు వరుసగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. విజయ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవల ఓ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం మాలీవుడ్ పరిశ్రమలో సంచలనంగా మారింది. దీనిపై చర్చ జరుగుతుండగానే మరో మహిళ విజయ్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. పరిచమైన అరగంటలోనే తన పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడంటూ శుక్రవారం ఆమె ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించింది. దీంతో పరిశ్రమలో ఆమె ఆరోపణలు మరింత హాట్‌టాపిక్‌గా నిలిచాయి.
చదవండి: మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు
ఇదిలా ఉంటే అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ కమిటి నుంచి విజయ్ బాబును తొలిగించినట్లు తాజాగా ప్రకటన వెలువడింది. తాత్కలికంగా విజయ్ బాబు సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు 5 మంది సభ్యులతో కూడిన ఇంటర్నల్ కమిటీ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించింది. కాగా లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ తాను అమ్మ నుంచి తప్పుకుంటానని నటుడు విజ్ఞప్తిని మన్నించి అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినందున తన కారణంగా అసోసియేషన్ ప్రతిష్ట దెబ్బతినరాదనే ఉద్దేశంతో తనను అమ్మ నుంచి తాత్కాలికంగా తొలగించాలని విజయ్ బాబు అసోసియేషన్‌కు లేఖ రాశాడు.
చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్
కొచ్చిలో జరిగిన సంస్ధ కార్యవర్గ సమావేశంలో విజయ్ బాబును ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని అమ్మ ప్రధాన కార్యదర్శి ఎడవెల బాబు తెలిపారు. మరోవైపు విజయ్ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన మళయాళ సినీ పరిశ్రమ స్పందించకపోవడాన్ని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) ప్రశ్నించింది. అసోసియేషన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి మాల పార్వతి అసోషియేషన్‌కు రాజీనామా చేసింది. విజయ్ బాబు లైంగికంగా ఇబ్బంది పెట్టాడన్నది నిజమని, స్యయంగా బాధితురాలే ఈ విషయం వెల్లడించిందన్నారు. దీంతో అతడు తప్పుచేశాడన్నది రుజువైందన్నారు. కానీ దీనిపై అమ్మ అతడికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. అతనే సభ్యత్వానికి రాజీనామ చేయమని చెప్పడం, కమిటీ అతడిని తప్పుకోమని చెప్పడంలో చాలా తేడా ఉందని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment