
మందు తాగుతూ నన్నూ తాగమని అడిగితే వద్దని చెప్పాను. ఇంతలో సడన్‌గా నా పెదాలపై ముద్దు పెట్టాడు. అతడు చేసిన పనికి షాకైన నేను క్షణాల్లో దూరం జరిగాను. అయినా సరే అతడు ఇంకొక్క ముద్దు పెడతా? అని అడిగాడు. నేను కుదరదని చెప్పేశాను.
మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌బాబు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవలే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో మహిళ విజయ్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని శుక్రవారం ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. 'నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం హౌస్ యజమాని విజయ్‌బాబును 2021 నవంబర్‌లో ఒకసారి కలిశాను. అది కూడా వర్క్ గురించి మాట్లాడేందుకే! మేమిద్దరం ప్రొఫెషనల్ విషయాల గురించి చర్చించుకున్నాం, ఆ తర్వాత వ్యక్తిగత సమస్యల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ మాటల్లో నాకు సహాయం అవసరమని గుర్తించాడు. మందు తాగుతూ నన్నూ తాగమని కోరితే వద్దని చెప్పాను. ఇంతలో సడన్‌గా నా పెదాలపై ముద్దు పెట్టాడు. అతడు చేసిన పనికి షాకైన నేను క్షణాల్లో దూరం జరిగాను'
'అయినా సరే అతడు ఇంకొక్క ముద్దు పెడతా? అని అడిగాడు. కుదరదని చెప్పేశాను. దీంతో అతడు నాకు సారీ చెప్పి దయచేసి ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని బతిమాలాడు. నాక్కూడా భయమేసి సరేనని తలూపాను. ఆ రూమ్‌లో నుంచి బయటకు వచ్చేశాను. కానీ అతడు అలా చీప్‌గా ప్రవర్తించడంతో భయపడిపోయాను. ఈ ఒక్క సంఘటనతో నేను నా వర్క్‌ను మధ్యలో ఆపేశాను. మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న నా కలను అక్కడితోనే తుడిచేశాను. తొలిసారి కలిసిన 20- 30 నిమిషాల్లోనే అతడు అలా అసభ్యంగా ప్రవర్తించాడంటే విజయ్‌బాబు వల్ల ఎంతమంది అమ్మాయిలు ఎన్ని బాధలు అనుభవించారో అర్థం అవుతుంది..'
చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో రాధేశ్యామ్ హిందీ వర్షన్, ఎప్పటినుంచంటే?
'ఇటీవలే ఓ నటి తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టిన వార్తను చదివినప్పుడు నేను కూడా ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనిపించింది. ఆమె ఎంత నరకం అనుభవించిందో నేను అర్థం చేసుకోగలను. కొందరు ఆ మహిళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ అక్కడున్న మనిషి ఎలాంటివాడో నాకు తెలుసు. సహాయం పేరుతో అమ్మాయిలను వాడుకోవాలనుకునే దుర్మార్గుడతడు. ఇలాంటివాళ్లను శిక్షించి 'ఇండస్ట్రీ అమ్మాయిలకు అంత మంచిది కాదు' అనే అపోహను తుడిచిపెట్టేలా చేయాలి' అని రాసుకొచ్చింది.
చదవండి: బిగ్‌బాస్ బ్యూటీ శ్వేత వర్మకు చేదు అనుభవం, సినిమా ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి..