మీడియా దిగ్గజం, ప్రముఖ నిర్మాత పీవీజీ కన్నుమూత | Media baron and Malayalam film producer PV Gangadharan passed away | Sakshi
Sakshi News home page

మీడియా దిగ్గజం, ప్రముఖ నిర్మాత పీవీజీ కన్నుమూత

Published Fri, Oct 13 2023 5:07 PM | Last Updated on Fri, Oct 13 2023 5:55 PM

Media baron and Malayalam film producer PV Gangadharan passed away - Sakshi

ప్రముఖ మలయాళ సినీ నిర్మాత, మీడియా దిగ్గజం, వ్యాపారవేత్త KTC గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు పీవీ గంగాధరన్ (80) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కేరళలోని కోజికోడ్‌లోని ఆసుపత్రిలో  గత వారం రోజులుగా  చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. కోజికోడ్‌లోని ఆయన ఇంటి వద్ద ప్రజలకు అంతిమ నివాళులు అర్పించేందుకు గంగాధరన్ భౌతికకాయాన్ని KTC గ్రూప్ కార్యాలయంలో, ఆ తరువాత టౌన్ హాల్‌లో ఉంచుతారు. రేపు (శనివారం అక్టోబర్ 14న) ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.  ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి విశేష  సేవలందించిన గంగాధరన్‌ అస్తమయంపై  కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సినీ నటులు, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

పీవీ గంగాధరన్  మలయాళ మీడియా సంస్థ మాతృభూమికి హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు.  గృహలక్ష్మి ఫిలింస్ బ్యానర్‌పై పలు పాపులర్‌, అవార్డు  విన్నింగ్‌ చిత్రాలను నిర్మించారు. 1977లో సుజాతతో ప్రారంభించి, మలయాళంలో 22 చిత్రాలను నిర్మించారు. 'మనసా వాచా కర్మణా,' 'అంగడి,' 'అహింస,' 'చిరియో చిరి,' 'కట్టాతే కిలిక్కూడు,' 'వార్త,' 'ఒరు వడక్కన్ వీరగాథ,' 'అధ్వాత్యం,'  లాంటివి వున్నాయి. ఎక్కువ భాగం విమర్శకుల ప్రశంసలతోపాటు ప్రజాదరణ పొందాయి. ఆయన చివరి చిత్రం జానకి జానే, తన కుమార్తెల నిర్మాణ సంస్థ SCube ఫిల్మ్స్‌తో కలిసి దీన్ని నిర్మించారు. యాసిడ్ దాడి నుండి బయటపడినవారిపై  పార్వతి నటించిన ఉయారే చిత్రాన్నికూడా పీవీజీనే నిర్మించడం విశేషం.

>

పీవీజీ అని పిలుచుకునే గంగాధరన్ సినీ, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. జాతీయ , రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో పాటు,  వర్త, తూవల్ కొట్టారం వంటి చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ నుండి ప్రశంసలు అందుకున్నారు.  కనక్కినవ్ మూవీ 1997లో జాతీయ సమగ్రతపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రతిష్టాత్మక నర్గీస్ దత్ అవార్డును అందుకుంది.. 2000లో 'సంతాం' చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. వీండుం చిల వీట్టుకార్యంగల్, అచ్చువింటే అమ్మ, నోట్‌బుక్ కూడా రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకున్నాయి. 2009లో ఆసియానెట్ నుండి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును  వీపీజీ గెలుచుకున్నారు.  కాగా 1943లో మాధవి సామి , పీవీ సామి దంపతులకు జన్మించిన  గంగాధరన్‌కు  భార్య షెరిన్ , ముగ్గురు కుమార్తెలు షెనుగ, షెగ్నా, షెర్గా ఉన్నారు. వీరు  2016లో SCubeని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement