మళయాలానికి మహర్దశ
తిరువనంతపురం: మాతృభాషకు కేరళ ప్రభుత్వం పట్టకట్టేందుకు సిద్ధమైంది. ఇక నుంచి మళయాలం శాస్త్రీయ భాషంత గొప్పగా అభివృద్ధి చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం అధికారులకు ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో కచ్చితంగా మళయాలం బోధించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
‘మళయాలం శాస్త్రీయ భాషంత గొప్పగా అభివృద్ధి చెందాలి. శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను కూడా మళయాలం భాషలోనే రాయాలి. మళయాలంలోనే చదవాలి. మళయాలంను అధికారిక భాషగా గుర్తించి తప్పనసరిగా అమలుచేయాలని ఆదేశించినా అధికారిక కార్యకలాపాలు అంటూ అధికారులు ఇంకా ఆంగ్లాన్ని గురించే ఆలోచిస్తున్నారు. ఇక అలాంటిది కుదరుదు. అన్ని పత్రికా ప్రకటనలు, నోటీసులు కచ్చితంగా మళయాలంలోనే ఉండాలి’ అని ఆదేశించారు.