
మలయాళ హీరో షాన్ నిగమ్, కలైయరసన్, నిహారిక, ఐశ్వర్య దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం మెడ్రాస్ కారన్. చాలా ఏళ్ల తర్వాత మెగా డాటర్ నిహారిక ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు. అయితే
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు పాన్‌రామ్ మాట్లాడుతూ దర్శకుడు వాలిమోహన్ దాస్ మంచి మిత్రుడు అని పేర్కొన్నారు. తాము ప్రతి చిత్ర షూటింగ్‌కు ముందు స్క్రీన్‌పై గురించి చర్చించుకుంటామని చెప్పారు. ఆయన మంచి ప్రతిభావంతుడని అన్నారు. ఈయన ఎదుగుదల తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. షాన్ నిగమ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. నటుడు కలైయరసన్ తనకు మంచి స్నేహితుడని అన్నారు. ఈ టీమ్ కలిసి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. మెడ్రాస్ కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దర్శకుడు పొన్‌రామ్ అన్నారు. మెడ్రాస్ కారన్ మంచి యాక్షన్, డ్రామా కథా చిత్రంగా ఉంటుందని చిత్ర దర్శకుడు వాలిమోహన్‌దాస్ పే ర్కొన్నారు. చిత్ర షూటింగ్ చైన్నె, మదురై, కొచ్చి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు.