![Mega Hero Varun Tej Special Wishes To His Sister Niharika Konidela Birthday - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/18/varun.gif.webp?itok=h6xbRwqM)
మెగా హీరో వరుణ్ తేజ్ తన సోదరి బర్త్‌డే సందర్భంగా స్పెషల్ విషెష్ తెలిపారు. ఇవాళ నిహారిక పుట్టినరోజు కావడంతో ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేశారు వరుణ్. నిహారికతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వరుణ్ తేజ్‌తో పాటు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, అతని సోదరుడు కూడా ఉన్నారు.
వరుణ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' హ్యాపీ బర్త్‌డే నిహారిక.. మీరు ఎప్పటిలాగే ఈ గొప్ప రోజున కూడా సరదాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మీ ఇరవైల్లోని చివరి ఏడాదిని ఎంజాయ్ చేయండి.' అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు నిహారిక రిప్లై కూడా ఇచ్చింది. 'థ్యాంక్యూ బంగారు.. ఈ ఫోటోలు నా జీవితంలో బెస్ట్‌గా నిలుస్తాయి' అంటూ పోస్ట్ చేసింది. నిహారిక బర్త్‌డే ఫోటోలు చూసిన అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతున్నారు. హ్యాపీ బర్త్‌డే అక్కా అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment