మాయపేటిక, శ్రీవల్లి వంటి పలు చిత్రాల్లో నటించిన యువ హీరో రజత్ రాఘవ్, ముంబై భామ ఐశ్వర్య రాజ్ బకుని జంటగా నటిస్తోన్న చిత్రం' మహర్ యోధ్ 1818'. ఈ చిత్రాన్ని రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో డిఎస్ఆర్ ఫిల్స్మ్ బ్యానర్‌పై సువర్ణ రాజు దాసరి నిర్మిస్తున్నారు. సోషల్ థ్రిల్లర్, ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ డాక్టర్ సింధు మాతాజీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ.పి.యస్.సి. సెల్ కమీషనర్ విక్టర్ ప్రసాద్ పాల్గొని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టరు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, దర్శకుడు నక్కింటి త్రినాథరావు పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సినిమా విశేషాలను వెల్లడించారు. కాగా.. ఈ చిత్రానికి మహా-శశాంక్ ద్వయం సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment