న్యూఢిల్లీ : నర్స్లు ట్రీట్మెంట్ తరువాత సంగతి ముందు మీరు మాట్లాడే లాంగ్వేజ్ను మార్చండి. మాట వినకపోతే మీపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ సర్క్యులర్ జారీ చేయడం కలకలం రేపుతోంది.
ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన గోవింద్ బల్లాబ్ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్)కు చెందిన నర్స్ లలో ఎక్కువ శాతం మంది మలయాళం భాష మాట్లాడుతున్నారు. దీనిపై పలువురు పేషెంట్లు ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పేషెంట్ల ఫిర్యాదుతో జీబీ పంత్ నర్స్ యూనియన్ అధ్యక్షుడు లిలాధర్ రామ్ చందాని నర్స్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో నర్స్ లు మలయాళంలో మాట్లాడుకుంటున్నారు. సిస్టర్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్ధం కాక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి నర్స్ లు ఇకపై హింది, ఇంగ్లీష్ భాషలు మాత్రమే మాట్లాడాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా లిలాధర్ మాట్లాడుతూ.. పేషెంట్ల ఫిర్యాదుల కారణంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అంతర్గతంగా, నర్సులు మరియు పరిపాలనలో ఎటువంటి సమస్య లేదు" అని అన్నారు. అయితే ఈ సర్క్యులర్ తో ఇతర నర్సింగ్ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా,మనదేశంలో వివిధ ఆసుపత్రులలో చాలా మంది నర్సులు కేరళకు చెందినవారు. వారి మాతృభాష మలయాళం. తమ మాతృభాష. మలయాళమని, మలయాళంలో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.
చదవండి : ‘గూగుల్ చేసిన పనికి క్షమాపణ చెప్పాల్సిందే’
Comments
Please login to add a commentAdd a comment