
అదితీరావ్ హైదరీ తన యాక్టింగ్ కెరీర్‌ను మలయాళం సినిమాతోనే మొదలుపెట్టారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటిస్తూ పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా ‘పద్మావత్’ ఆమెకు బ్రేక్ తెచ్చిందని చెప్పాలి. అలాగే మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘చెలియా’, ‘నవాబ్’ చిత్రాలూ మంచి పేరు తెచ్చాయి. ఒకవైపు హిందీ సినిమాల్లో నటిస్తూనే తెలుగు, తమిళ సినిమాలూ చేస్తున్నారు. పదమూడేళ్ల తర్వాత ఓ మలయాళ సినిమాలో నటించబోతున్నారు అదితీ. 2006లో మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘ప్రజాపతి’ సినిమా ద్వారా మలయాళ తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు అదితీ. మళ్లీ 13 ఏళ్లకు నరానిపుళ షానవాస్ తెరకెక్కించబోయే ‘సూఫియుమ్ సుజాతయుమ్’ సినిమాలో అదితీరావ్ హీరోయిన్‌గా నటించబోతున్నారు. సంగీత ప్రధానంగా సాగే సినిమా ఇది. సుజాత పేరు అదితీ రావ్ పాత్రది అని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment