వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా | Actor Jiiva To Portray Andhra CM YS Jagan Mohan Reddy In Yatra 2 | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా

Published Sun, Jun 11 2023 4:33 AM | Last Updated on Sun, Jun 11 2023 4:33 AM

Actor Jiiva To Portray Andhra CM YS Jagan Mohan Reddy In Yatra 2 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌తో ‘యాత్ర’ (2019) సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్‌ ప్రస్తుతం ‘యాత్ర 2’కి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో జీవాను జగన్‌ మోహన్‌ రెడ్డి పాత్రకు సంప్రదించారు మహీ.

ఈ చిత్రంలో నటించడానికి జీవా సుముఖత వ్యక్తపరిచారు. ఇక వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. జగన్‌ పాదయాత్ర నుంచి ప్రారంభమై సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ సినిమా ముగుస్తుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్‌ పనులు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టు 3న మొదలవుతుంది. 2024 ఫిబ్రవరిలో ‘యాత్ర 2’ సినిమా విడుదల కానుంది. కాగా మహీ వి. రాఘవ్‌ దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement