అమెరికాలోని సీయాటెల్‌లో యాత్ర2 మెగా ప్రీమియర్ షో రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. YSRCP USA, సోషల్ మీడియా, జగనన్న కనెక్ట్స్ ఆధ్వర్యంలో 'సీయాటెల్ సిద్ధం ఫర్ యాత్ర2 ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్టు APNRTS రీజినల్ కో ఆర్డినేటర్ దుష్యంత్ రెడ్డి తెలిపారు. మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవ్, నిర్మాత శివ మేక, చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు తెలిపారు.
సీయాటెల్ నలుమూలల నుంచి వైఎస్సార్, సీఎం జగన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి యాత్ర 2 సెలబ్రేషన్ లో పాలు పంచుకున్నారు. YSRCP USA , సోషల్ మీడియా కమిటీ సభ్యులు.. చిన్నారులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్సార్ పాలనని గుర్తు చేసుకున్నారు. వైస్సార్ అడుగు జాడల్లో నవరత్నాలతో పాటు విన్నూతన మైన పథకాలు AP ప్రజలకి అందించిన CM YS జగన్ పరిపాలన ని గుర్తు చేస్తూ , రాబోయే ఎలక్షన్ లో 140 పై చిలుకు స్థానాల లో విజయ దుందుభి మోగించడం ఖాయమని ఈ సందర్భం గా తెలియ జేశారు.
ఈ ఈవెంట్ లో YSRCP USA సభ్యులు మునీశ్వర్ రెడ్డి నాగిరెడ్డి , వినయ్ రెడ్డి, అనిల్ బెల్లపు , JC రెడ్డి , వెంకట్ సుబ్బా రెడ్డి, ప్రకాష్ కొండూరు ,శంకర్ తిప్పల ,ప్రకాష్ మామిడి,జితేందర్ రెడ్డి ,శ్రీనివాస రెడ్డి మల్లంపాటి ,భాస్కర్ రెడ్డి , వినోద్ ,సునీల్ బలభద్ర ,నరేన్ రెడ్డి ,వెంకట్ రెడ్డి,రాజ శేఖర్ రెడ్డి ,ప్రదీప్, బాల ,కరుణాకార్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని సహాయ సహకారాలు అందజేశారు. కమ్యూనిటీ లీడర్స్ మనోజ్ చింతి రెడ్డి , సాయిరెడ్డి కంచరకుంట్ల ,సువీన్ రెడ్డి ఉప్పల ,నవీన్ గోలి ప్రసంగించి యాత్ర 2 మూవీ కి ధన్యవాదాలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment