సింగపూర్‌లో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా | lyricist Sirivennala book inagurated at Sri Samskruthika Kalasaradhi Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా

Published Mon, May 20 2024 3:28 PM | Last Updated on Mon, May 20 2024 4:12 PM

lyricist Sirivennala book inagurated at Sri Samskruthika Kalasaradhi Singapore

శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు వారి ఆద్వర్యంలో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఒన్ కాన్ బెర్రా పంక్షన్ హాల్లో, 19 మే ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది, పుస్తక రచయిత, సివిల్స్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమానిగా ఆకెళ్ళ రాఘవేంద్ర అందరికీ సుపరిచితులు. ఈ కార్యక్రమంలో పాట షికారుకొచ్చింది పుస్తక రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకూ దాదాపు 200 పైగా వేదికల మీద మాట్లాడినా  కుటుంబ సమేతంగా ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తొలిసారి ఇక్కడే కుదిరిందని, ఇంతకు ముందు ఎన్ని సార్లు ప్రయత్నించినా వీలు కానిది ఈ సింగపూరు సభ ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.  

తన గురువు సిరివెన్నెల  జీవితాన్ని సమతుల్యం చేస్తూ రాసిన పుస్తకం అని రచయిత తెలిపారు.  ఈ సందర్బంగా సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబందాన్ని, తనను ప్రోత్సహించిన వైనాన్ని పంచుకున్నారు. సింగపూరులో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుందని ప్రశంసించారు. ఇకపై సంస్థ నిర్వహించే కార్యక్రమాలను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.   సిరివెన్నెల అబిమానులందరికీ కృతజ్ఞతలు అని భావోద్వేగానికిలోనయ్యారు.  

సుబ్బు వి పాలకుర్తి సభ నిర్వహణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోసంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ సిరివెన్నెల జయంతి అయిన మే 20వ తేదీకి ఒక్కరోజు ముందు ఆయన జీవిత పుస్తకాన్ని, పుస్తక రచయిత, సిరివెన్నెల ఆత్మీయ శిష్యులు ఆకెళ్ళ రాఘవేంద్ర ద్వారా సింగపూర్‌లో  ఆవిష్కరించుకోవడం చాలా ఆనందం అని,  కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలును తెలియచేసారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సిరివెన్నెల స్మరించుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా మరొక్కసారి అందరికీ దక్కిందన్నారు. తెలుగు అక్షరం ఉన్నంత వరకూ సిరివెన్నెల పాట తెలుగు వారి నోటివెంట వినబడుతూనే ఉంటుందని తెలియచేసారు.

ఈ కార్యక్రమమునకు రామాంజనేయులు చమిరాజు, సునీల్ రామినేని, మమత మాడబతుల సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. 50 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమము, ఆన్లైన్ ద్వారా 1000కి పైగా వీక్షించారు. సిరివెన్నెల అభిమానులు షర్మిల, కృష్ణ కాంతి, మాధవి, పణీష్ తమ పాటలు, కవితలు వినింపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమము చివర్లో ఆకెళ్ళ సిరివెన్నెల అద్భుతమైన ప్రసంగంతో తండ్రికి తగ్గ తనయగా ప్రశంసలు పొందారు. అతిదులందరికి విందు భోజన ఏర్పాట్లను రేణుక, అరుణ, శ్రీలలిత తదితరులు పర్యవేక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement