
నిజానికి ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్‌డేట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్‌డేట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది చిత్రయూనిట్.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా వచ్చిన యాత్ర సినిమా 2019లో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి.రాఘవ్ దానికి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. నిజానికి ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్‌డేట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్‌డేట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది చిత్రయూనిట్.
అంతటితో ఆగలేదు, జూలై 8న అసలు సిసలు అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు పేర్కొంది. శనివారం ఉదయం 11.35 గంటలకు యాత్ర 2 మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే వి.సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో ‘రంగం’ మూవీ ఫేమ్ జీవా నటించనున్నారు. ఆగస్టు 3 నుంచి ‘యాత్ర 2’ షూటింగ్ మొదలవుతుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది.