పల్సస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16,17 తేదీలలో జరగబోయే వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 విజయవంతం చేసేందుకు ఉద్దేశించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా భువనేశ్వర్‌లో పల్సస్ సీఈవో డా. గేదెల శ్రీనుబాబు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో అనంతరం జరిగిన చర్చా కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
భవిష్యత్తులో ఇండస్ట్రీ ఆటోమేషన్ వైపు కంపెనీలను ఎలా మార్చుకోవచ్చో ప్రెజెంటేషన్ ద్వారా ఆయా రంగాలకు చెందిన నిపుణులు వివరించారు. ఐటీ, ఐటీ సేవలు, పారిశ్రామిక ప్రగతిలో మన గతాన్ని, వర్తమానాన్ని సూక్ష్మ పరిశీలన చేసిన ప్రముఖులు పారిశ్రామిక ప్రగతి భవిష్యత్తుకు సిద్ధం కావాలని డా. శ్రీనుబాబు గేదెల మార్గనిర్దేశనం చేశారు. ఇంటరాక్షన్ విత్ ఇంటిలిజెన్స్, నాలెడ్జ్ ట్రాన్స్ ఫార్మేషన్, కంప్యూటేషన్ అనుసరించడం ద్వారా ఇండస్ట్రీ ఆటోమేషన్ సాధ్యమవుతుందని, నూతన ఆవిష్కరణలు సరికొత్త దారి చూపుతాయని తెలియజేశారు.
హెల్త్ టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫైనాన్స్, ఫార్మా, బయో, ఇతర పారిశ్రామిక రంగాలకు టెక్నాలజీని అనుసంధానించడంపై ప్రధానంగా దృష్టి సారించిన వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 భారతదేశంలో మొట్టమొదటిదని శ్రీనుబాబు తెలిపారు. 2023 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో పల్సస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 పారిశ్రామిక ప్రగతికి సరికొత్త దారి చూపనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్ సమ్మిట్‌కి హాజరయ్యేందుకు ప్రధాన సంస్థల సీఈవోలు, ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు.
రోడ్ షో అనంతరం జరిగిన కార్యక్రమానికి ఒడిశా ఐటీ మంత్రి తుషార్ కాంతి బెహెరా, టాటా స్టీల్ మైనింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కుమార్ సతిజా, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శంకర్ ఎం వేణుగోపాల్, కాన్సెంట్రిక్స్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ భర్ద్వాజ్, తత్వా టెక్నాలజీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయాస్కాంత మొహంతి, ఆస్ట్రల్ పైప్స్ కు చెందిన సుమన్ కుమార్ మొహపాత్ర, వేదాంతకు చెందిన యోగేష్ బొహ్రా తదితరులు పాల్గొన్నారు. ఇఫ్కోకు చెందిన జితేంద్ర కుమార్ పాండే టెక్ సమ్మిట్ రోడ్ షోకి తన మద్దతు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment