నవీన్ పట్నాయక్.. దేశంలో సుదీర్ఘకాలం(24 ఏళ్లపాటు) ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. రాజకీయాల్లో మృదుస్వభావిగా ఆయనకంటూ ఓ ట్యాగ్‌లైన్ ఉంది. అలాగే.. మెచ్యూర్డ్ స్టేట్స్‌మన్‌గా వాజ్‌పేయి లాంటి రాజకీయ ఉద్ధండులతో ప్రశంసలు అందుకున్నారాయన. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయినప్పటికీ.. ఒడిశాలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొల్పుతూ మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారాయన.
తాజాగా ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన రాకను గమనించి.. సీఎం మోహన్ మాఝి సహా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడ్డారు. వాళ్లందరికీ నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్లబోయారు. ఆ సమయంలో కంటాబంజి ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్ లేచి నిలబడి తనను తాను పరిచయం చేసుకున్నారు. అది చూసి.. ‘‘మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’’ అని నవీన్ అన్నారు. దీంతో అక్కడున్న వాళ్లంతా చిరునవ్వులు చిందించారు.
Naveen Patnaik & CM Mohan Majhi greet each other in assembly. Beautiful Video pic.twitter.com/6BL21FAZP5
— Times Algebra (@TimesAlgebraIND) June 18, 2024
ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల(గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్ జిల్లాలోని కంటాబంజి)నుంచి నవీన్ పట్నాయక్ పోటీ చేశారు. అయితే కంటాబంజిలో భాజపా అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓడిపోయారు. హింజలిలో గెలిచిన ఆయన మంగళవారం ప్రమాణస్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు.
Naveen Patnaik’s dignity is a touchstone in political relationships. Here’s how he greeted the party that has all but wiped him out. Yes, they weren’t the kind of political enemies we’re accustomed too, but Naveen has been nothing but an image of grace. pic.twitter.com/VzYQKJ5WnS
— Shiv Aroor (@ShivAroor) June 12, 2024
ఇదే కాదు.. సీఎంగా మోహన్ మాఝి ప్రమాణ స్వీకారానికి నవీన్ పట్నాయక్ హాజరై ఆశీర్వదించిన తీరు రాజకీయ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది కూడా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనేది ఒక మాట. అలాగే.. ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండాలో నవీన్‌ను చూసి నేర్చుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
Comments
Please login to add a commentAdd a comment