నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు! | chandrababu naidu shades in elections | Sakshi
Sakshi News home page

నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!

Published Thu, May 9 2024 6:09 AM | Last Updated on Thu, May 9 2024 6:13 AM

chandrababu naidu shades in elections

ఐదేళ్ల క్రితం విజయవాడ రోడ్లపైనా‘ మోదీ గో బ్యాక్‌’ అంటూ టీడీపీ నేతల నినాదాలు 

మోదీ కరుడుకట్టిన ఉగ్రవాదంటూ బాబు నిందలు 

భార్యను చూసుకోనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని విసుర్లు.. మోదీ సైతం బాబుపై విమర్శలు 

పోలవరంను ఏటీఎంగా వాడుకుంటున్నారని మండిపాటు.. ఇప్పుడు అధికారమే పరమావధిగా 

అవకాశవాద రాజకీయాలు.. విస్తుపోతున్న ప్రజలు  

సాక్షి, అమరావతి: చంద్రబాబుకు అధికారమే పరమావధి. ఇందుకోసం ఎవరినైనా వెన్ను­పో­టు పొడుస్తారు.. విమర్శిస్తారు.. వ్యతిరేకిస్తారు. విలువలు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేస్తా­రు. మళ్లీ అవసరమైతే తాను తిట్టినవారి ఒళ్లోనే చేరతారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 10న ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. తాజాగా బుధవారం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షో నిర్వహించిన విజయవాడ రోడ్డుపైనే నాడు టీడీపీ నేతలు ప్రధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ నేత­లు నల్ల జెండాలు ఎగరవేస్తూ ‘గో బ్యాక్‌ మోదీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు నాలుగైదు రోజుల ముందు చంద్రబాబు విజయవాడ బెంజి సర్కిల్‌లో నల్లచొక్కా తొడుక్కొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

ఈ ఘటనకు ఆరు నె­లలు ముందే బీజేపీని వ్యతిరేకించి టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో  ఘోరంగా ఓడిపోయిన టీడీపీ మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు అదే బీజేపీతో పొత్తు పెట్టుకొని తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిపోవడం గమనార్హం. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డిఅయినా కరుస్తారనడానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం. 

నాడు ఎన్నికల ముందు బాబు డ్రామా.. 
2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరింది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ చేరి మంత్రి పదవులు కూడా తీసుకుంది. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరంకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రైల్వే జోన్‌ ఇలా ఏ ముఖ్యమైన హామీని సాధించలేకపోయింది. ఇలా అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగింది. 

రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తప్పుకుంటున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూడా బీజేపీ ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరారు. అప్పట్లో ‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. భార్యనే చూసుకోనివాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు’ అంటూ చంద్రబాబు వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

దీనికి తానేమీ తక్కువ తినలేదన్నట్టు ప్రధాని మోదీ సైతం ‘చంద్రబాబు చేస్తున్నది అమరా­వతి నిర్మాణం కాదు.. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు’ అంటూ విమర్శించారు. అంతేకాకుండా ‘పోలవరం ప్రాజెక్టును డబ్బులు డ్రా చేసిపెట్టే ఏటీఎం లాగానే చంద్రబాబు వాడుకుంటున్నారు’ అని తీవ్ర విమర్శలు చేశారు. నాడు ప్రధాని మోదీపై చంద్రబాబు వ్యక్తిగతంగా దారుణమైన విమర్శలు చేసి.. ఇప్పుడు అధికారమే పరమావధిగా పొత్తు పెట్టు­కోవడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.  

మోదీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు.. 
దేశ రక్షణ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ.59,000 కోట్ల రఫెల్‌ ఒప్పందం, అందుకు సంబంధించిన నివేదికలు, ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ విధ్వంసక నిర్ణయాలను తెలియజేస్తోంది. మోదీ జీ మీరు దేశాన్ని మోసం చేసినప్పుడు సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు.   

 2019 ఫిబ్రవరి 8న తన ట్విట్టర్‌లో  
మీకూ, బ్రిటిష్‌ వాళ్లకూ తేడా ఏమిటి? వాళ్లే నయం. కాటన్‌ దొర ఇచి్చన నీళ్లయినా తాగుతున్నాం. మేం మీ బానిసలమా? రాజధానిని 50 ఏళ్లకు నిరి్మస్తారా? నాలాంటి సీనియర్‌ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నారంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్‌షా రాజకీయాల్లోకి వచ్చారు. నేను 1978లోనే ఎమ్మెల్యేనయ్యా. ప్రధాని మోదీని సార్‌ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోతారా?  –2019 ఫిబ్రవరి 2న శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకొని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి.  

2018 జూన్‌ 9న నెల్లూరు సభలో  
బీజేపీకి ఒకటే చెబుతున్నా.. టీడీపీతో పెట్టుకుంటే ఖబడ్డార్‌.. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయోమో.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాగవు

2018లో శృంగవరపుకోటలో  
నేను ఎవరికీ భయపడేది లేదు. నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో నాయకత్వాన్ని బలహీనపరచడానికి ఇష్టమొచ్చినట్టు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశాను. ఎప్పుడు భయపడలేదు. భయమనేది నా జీవితంలో లేదు.  

2018 మార్చి 6న విజయవాడలో  
విభజన హామీలను నాలుగు బడ్జెట్‌లలో పట్టించుకోలేదు. చివరి బడ్జెట్‌లోనూ ఏపీ పేరు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదు.      –2018 మార్చి 7న  

వివిధ సందర్భాల్లో మోదీ చంద్రబాబునుద్దేశించి చేసిన విమర్శలు.. 
» అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచు­కునే ఆశ నాకు లేదు.  ళీ ఎన్టీఆర్‌ ఏపీకి కాంగ్రెస్‌ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అందువల్లే టీడీపీ ఆవిర్భవించింది. కానీ, ఈ రోజు కాంగ్రెస్‌ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కొవాల్సిన చంద్రబాబు అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్‌ను దుష్టకాంగ్రెస్‌ అని ఎన్టీఆర్‌ అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి (చంద్రబాబు) అదే కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు. 

» చంద్రబాబుకు ఏమైంది? ఆయన నా కంటే చాలా సీనియర్‌నని మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తుంటారు. ఇందులో వివాదం ఏముంది? మీరు (చంద్రబాబు) సీనియర్‌. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు. కానీ, మీరు సీనియర్‌.. కూటములు మార్చడంలో.. కొత్త కూటములు కట్టడంలో.. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో.. ఈ రోజు ఎవరిని తిడతారో..  రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో. నేనైతే ఈ విషయాల్లో సీనియర్‌ను కానే కాదు. 
చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం. –2019 ఫిబ్రవరి 10న గుంటూరులో ప్రధాని మోదీ 

»  కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. ఎప్పుటికప్పుడు ప్రాజెక్టు ఖర్చు అంచనాలు పెంచుతూ, ఎక్కువ నిధులు పొందుతున్నారు.  పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న నాయకుల (చంద్రబాబు)కు ఒక ఏటీఎం లాంటిది. అందులో నుంచి డబ్బులు తీసేసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు  చేయాలని యూటర్న్‌ బాబు అనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు.  

»  ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారైతే.. ఇక్కడి యూటర్న్‌ బాబు మాత్రం తన కుటుంబం మొదట, ఆ తర్వాత తన అనుయాయులు అన్నట్టు పాలన సాగిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హెరిటేజ్‌ (సంస్కృతి) మంచి పాలనతో అభివృద్ధి చెందాలని. కానీ యూటర్న్‌ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్‌ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు. 
– 2019 ఏప్రిల్‌ 1న రాజమండ్రి ఎన్నికల సభలో ప్రధాని మోదీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement