Union Home Minister Amit Shah Angry On BJP Leaders Karnataka - Sakshi
Sakshi News home page

బైక్‌లే ఉన్నాయ్‌.. జనాలేరీ?.. బీజేపీ శ్రేణులపై అమిత్‌షా సీరియస్‌

Published Sun, May 7 2023 3:38 PM | Last Updated on Sun, May 7 2023 4:03 PM

Union Home Minister Amit Shah Angry On BJP Leaders Karnataka - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో కార్యకర్తల కంటే ఎక్కువగా బైక్‌లే దర్శనమిచ్చాయి. దీంతో అమిత్‌షా బీజేపీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. జనాల కంటే బైక్‌లే ఎక్కువగా కన్పిస్తున్నాయి.. ఏంటిది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కాగా.. బెంగళూరులో ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు(ఆదివారం) నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. అభిమానులు బీజేపీ శ్రేణులు భారీగా తరిలివచ్చారు. మోదీపై పూలవర్షం కురిపించారు. ఈలలు, కేరింతలతో హోరెత్తించారు.

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్‌, బీజేపీ ఇప్పటికే పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించాయి.
చదవండి: బీజేపీది చీకటి పాలన: సోనియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement