
సర్వజ్ఞనగర రోడ్ షోలో కాంగ్రెస్ అభ్యర్థి కే.జే.జార్జ్
శివాజీనగర: రాజధాని బెంగళూరు నగరంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. రోడ్‌షోలు, పాదయాత్రలతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బుధవారం వివిధ ప్రాంతాల్లో వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలసి ఓట్లను అభ్యర్థించారు.
సీ.వీ.రామన్‌నగరలో అణ్ణామలై రోడ్‌షోకు విశేష స్పందన
తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అణ్ణామలై సీవీ రామన్‌నగర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎస్.రఘు తరపున బుధవారం మర్ఫీటౌన్‌లో నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. వేలాది మంది ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎస్.రఘు మాట్లాడుతూ... మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించటంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం కలిగింది.
అందుచేత మరోసారి తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. అదే విధంగానే నగరంలోని శాంతినగర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.ఏ.హ్యారిస్ నీలసంద్ర వార్డులో ఎల్‌ఆర్ నగర, సమతానగర, మారేనహళ్లి, అంబేడ్కర్‌నగర, పంప్ హౌస్, రోజ్ గార్డెన్, ఎంసీ గార్డెన్ తదితర ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేపట్టారు. సర్వజ నగర కాంగ్రెస్ అభ్యర్థి కే.జే.జార్జ్ నియోజకవర్గ పరిధిలోని బాణసవాడిలో రోడ్ షో నిర్వహించి విస్తృత ప్రచారం చేపట్టారు. తనయుడు రాణా జార్జ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment