సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా అధికార పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం, హోంమంత్రి అమిత్ షా టార్గెట్‌గా మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు.
కాగా, మంత్రి కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 90-100 సీట్లు గెలుస్తాం. తెలంగాణలో బీజేపీ ఉనికి కోల్పోతుంది. దేశం అన్ని రంగాల్లో వెనుకబడటానికి బీజేపీనే కారణం. మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓ వైపు ఒవైసీ మాపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విధానాలు బాగున్నాయంటున్నారు. డీలిమిటేషన్‌పై అన్ని పార్టీలు ఏకం కావాలి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment