కీలక దశకు లోక్‌సభ ఎన్నికల పోరు
ప్రచారానికి మిగిలిందిఇంకా వారం రోజులే..
2 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు
నేడు కొత్తకోటలో కాంగ్రెస్ కార్నర్‌మీటింగ్.. సీఎం రేవంత్ రాక
రేపు ఎర్రవల్లి చౌరస్తాలో సభ..హాజరుకానున్న రాహుల్ గాంధీ
10న నారాయణపేటకు ప్రధాని మోదీ.. త్వరలో అమిత్‌షా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.
రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.
ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీ ల అభ్యర్థులకు మద్దగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్‌షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది.
ఇవి చదవండి: మరోసారి పీఠమెక్కేదెవరో..?
Comments
Please login to add a commentAdd a comment