కావలికి చెందిన వలంటీర్లతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలి సంతకం వలంటీర్ల ఫైల్‌పైనేనని హామీ
కావలి/నెల్లూరు(దర్గామిట్ట)/అల్లూరు/కావలి: రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల రాజీనామాలతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సీఎం వైఎస్ జగన్‌అన్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో ఉన్న ఆర్‌ఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు వచ్చిన ఆయన్ను కావలికి చెందిన పలువురు వలంటీర్లు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘రెండోసారి మిమ్మల్ని సీఎంగా చేసుకునేందుకు కావలి పట్టణానికి సంబంధించిన వలంటీర్లందరం రాజీనామా చేశాం’ అని తెలపగా.. పైవిధంగా సీఎం జగన్ స్పందించారు. తాను రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే వలంటీర్లకు సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని, సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను కొనసాగిస్తామని చెప్పారు.
జిల్లాలో క్లీన్ స్వీప్ ఖాయం
జిల్లాలోని ఒక పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్‌స్వీప్ చేయడం తథ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇందుకు గుర్తుగా నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం స్టే పాయింట్ వద్ద టీషర్టుల మీద 8 బై 8 వైఎస్సార్‌సీపీ స్టాంప్‌ను వేసి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి, ఉదయగిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment