జెరూసలెం: ఉగ్రవాద సంస్థ హమాస్ పూర్తిగా నాశనమైన తర్వాతే గాజాలో శాంతి సాధ్యమవుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు. తాజాగా క్రిస్‌మస్ రోజు గాజాలో పర్యటించిన నెతన్యాహు తర్వాత ఇజ్రాయెల్ తిరిగి వచ్చి తన పార్టీ(లికుడ్) మీటింగ్‌లో మాట్లాడారు.
రాబోయే రోజుల్లో హమాస్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా దాడులు మరింత తీవ్రం చేస్తామని నెతన్యాహు తెలిపారు.క్రిస్‌మస్ రోజు గాజాలో శరణార్థుల క్యాంపు మీద ఇజ్రాయెల్ జరిపిన దాడులపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) రిపోర్టు చేసిన తర్వాత నెతన్యాహు ప్రకటన వెల్లడవడం గమనార్హం.
‘హమాస్ పూర్తిగా నాశనమవ్వాలి. గాజా డీ మిలిటరైజ్ కావాలి. పాలస్తీనా సొసైట్ రాడికల్ ఫ్రీగా మారాలి. గాజాలో శాంతి నెలకొల్పడానికి ఈ మూడు లక్ష్యాలు పూర్తవ్వాలి. అప్పుడే గాజాలో శాంతిపై పాలస్తీనాతో శాంతి ఒప్పందం చేసుకుంటాం’ అని నెతన్యాహు స్పష్టం చేశారు.
ఇదీచదవండి..అమెరికా ఎన్నికలు.. ట్రంప్ క్యాంపెయిన్‌లో ఆమె కీ రోల్ !
Comments
Please login to add a commentAdd a comment