జెరూసలేం: ఇటీవల లెబనాన్, సిరియాలపై జరిగిన పేజర్ దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ దాడిలో పలువురు హిజ్బుల్లా నేతలు హతమయ్యారు. తాజాగా ఈ దాడులకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పేజర్ల దాడుల ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.
గత సెప్టెంబరులో హిజ్బుల్లాపై జరిపిన పేజర్ దాడులకు తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా బెంజమిన్ నెతన్యాహు ధృవీకరించారు. ఈ దాడుల్లో 40 మంది మృతిచెందగా, మూడు వేల మంది గాయాలపాలయ్యారు. నాడు ఈ పేజర్ల దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై లెబనాన్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. దీనిని మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొంది.
తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రతినిధి ఒమర్ దోస్త్రి మీడియాతో మాట్లాడుతూ లెబనాన్‌లో పేజర్ ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెతన్యాహు స్వయంగా ధృవీకరించారన్నారు. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు అందిన కొద్ది రోజులకే ఈ దాడుల వెనుక ఉన్నది తానే అనే విషయాన్ని నెతన్యాహు తొలిసారిగా బహిరంగంగా అంగీకరించారు.
కాగా ఈ పేలిన పేజర్లను హంగేరీకి చెందిన బీఏసీ కన్సల్టింగ్ సంస్థ తయారు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ గతంలో తెలిపింది. గత సెప్టెంబరులో లెబనాన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా నిరసనలను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే లెబనాన్‌లోకి తమ దళాలను దింపి, దాడులకు తెగబడింది.
ఇది కూడా చదవండి: ‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment