భారత్–ఇజ్రాయెల్ పంచమంత్ర
70 ఏళ్లలో ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ. వివిధ కీలక రంగాల్లో ఆ దేశంతో మైత్రి బంధాన్ని బలోపేతం చేసుకోవాలని మోదీ భావిస్తున్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు నెరపుతుండగా.. ఇజ్రాయెల్ ఎందుకంత ప్రత్యేకం అంటే దానికి ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. రక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, దౌత్యం, నీటి నిర్వహణ. ప్రస్తుతం ఇరు దేశాల చర్చల్లో వీటిదే అగ్రతాంబూలం. – సాక్షి, తెలంగాణ డెస్క్
1 రక్షణ
2012–16 మధ్యకాలంలో ఇజ్రాయెల్ మొత్తం ఆయుధాల ఎగుమతుల్లో 41 శాతం కొనుగోలు చేసింది మనదేశమే. మరోవైపు ఆయుధాల కోసం మనదేశం ఆధారపడు తున్న మూడో దేశం ఇజ్రాయెల్. 1962 ఇండో–చైనా యుద్ధంతో ఇరు దేశాల బంధం మొదలైంది. 1965, 1971లో పాక్‌తో యుద్ధం సమయంలోనూ మనదేశానికి తోడ్పా టును అందించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యాధునిక ఉపరితలం నుంచి గగనతలం మధ్యతరహా క్షిపణి పరిజ్ఞానానికి సంబంధించి ఇరు దేశాల మధ్యా రూ.13 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది.
2 దౌత్య సంబంధాలు
మోదీ పర్యటనకు ముందుగా ఎల్‌కే అడ్వాణీ (2000లో), ఏపీజే అబ్దుల్ కలాం(2008లో), రాజ్‌నాథ్‌సింగ్ (2014లో), ప్రణబ్‌ముఖర్జీ (2015లో), సుష్మా స్వరాజ్ (2016లో) ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మేలో మూడు భారత యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ ముంబై, ఐఎన్‌ఎస్ త్రిశూల్, ఐఎన్‌ఎస్ ఆదిత్య ఇజ్రాయెల్‌లో గుడ్‌విల్ విజిట్‌కు వెళ్లాయి.
3 వ్యవసాయం
అత్యాధునిక సాగు పద్ధతులను గురించి మనదేశ రైతులకు తెలియ జేసేందుకు ఇండో–ఇజ్రాయెల్ అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్ 2015–18 ప్రస్తుతం అమలులో ఉంది. ఇజ్రాయెల్ సాయంతో ప్రతిపాదిత 26 ఎక్సలెన్స్ సెంట ర్లకుగానూ 15 సెంటర్ల అభివృద్ధి పూర్తయ్యింది. హార్టికల్చర్, రక్షిత సాగు, నర్సరీ నిర్వహణ, సూక్ష్మ సేద్యం, నీటిపా రుదల కోత నిర్వహణ మొదలైన అంశాల్లో ఇజ్రాయెల్ టెక్నాలజీతో మనదేశం ముఖ్యంగా హరియా ణా, మహారాష్ట్ర లబ్ధిపొందుతోంది.
4 నీటి నిర్వహణ
దేశంలో జల సంరక్షణ నిమిత్తం జూన్‌లో ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో తాగునీటిని ప్రజలకు అందించనున్నారు.
5 వాణిజ్యం
ఇజ్రాయెల్ భారత దేశ 38వ అతిపెద్ద వాణిజ్య భాగ స్వామి. 2016–17లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం విలువ రూ.33,634 కోట్లు. ఖనిజ ఇంధనాలు, ఆయిల్స్ మొద లైనవి మనదేశ ఎగుమతుల్లో కీలకం. ఇక ఇజ్రాయెల్ నుంచి దిగుమతుల్లో సహజ ముత్యాలు, విలువైన రాళ్లు ముఖ్యమైనవి. ద్వైపాక్షిక వాణిజ్యంలో వజ్రాలదే 54 శాతం కావడం గమనార్హం.