జెరూసలెం: తమ దేశం మీద డ్రోన్‌లు, మిసైళ్లతో ఇరాన్ జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం(ఏప్రిల్14) స్పందించారు. ఇరాన్ దాడులకు ఎలా స్పందించాలనేదానిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్ భేటీకి వెళ్లే ముందు నెతన్యాహు మాట్లాడారు.‘మేం అడ్డుకున్నాం. కూల్చివేశాం. కలిసికట్టుగా గెలుస్తాం’అని ఇరాన్ డ్రోన్‌లు, మిసైళ్లను అమెరికా,బ్రిటన్ సహకారంతో కూల్చివేయడంపై స్పందించారు.
కాగా శనివారం(ఏప్రిల్13)అర్ధరాత్రి ఇరాన్,ఇజ్రాయెల్‌పై వందల కొద్ది డ్రోన్‌లు, మిసైళ్లతో దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తునేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ‘ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ ఇంకా ముగియలేదు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం’అని ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి యోవ్ గల్లాంట్ అన్నారు.
కాగా, సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్‌లు, మిసైళ్లతో దాడులకు దిగింది.
ఇదీ చదవండి.. ఇరాన్ దాడులు.. ఇజ్రాయెల్‌కు పోప్ కీలక సూచన
Comments
Please login to add a commentAdd a comment