ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్ ఉన్ విచిత్రమైన పాలనా తీరుతో తరచు వార్తల్లో నిలుస్తుంటాడు. ఓ నియంతలా పాలిస్తుంటాడు. అర్థంకానీ నిబంధనలతో ప్రజలను కష్టపెడుతుంటాడన్న విషయంలో తెలిసిందే. అంతేగాదు మహిళల వ్యక్తిగత ఫ్యాషన్‌లో భయానక నిబంధనలను విధించాడు కిమ్. ఫ్యాషన్ ప్రపంచంలో మహిళలు ఎంతో ఇష్టపడే రెడ్ లిప్‌స్టిక్ కూడా బ్యాన్ చేశాడంటే కిమ్ మామ ఆలోచన విధానం ఏంటో క్లియర్‌గా తెలుస్తోంది. కనీసం వారి వ్యక్తిగత అలకంరణ, ఫ్యాషన్ విషయాల్లో స్వేచ్ఛని కూడా లాగేసుకుంటే వామ్మో ఇదేం నాయకుడు రా బాబు అనిపిస్తుంది కదూ. అక్కడ ఫ్యాషన్ విషయంలో ప్రజలకు విధించిన ఆంక్షలు ఏంటో సవివరంగా చూద్దామా..!
ఉత్తర కొరియాలో ధరించే దుస్తుల దగ్గరనుంచి అలకరణ వరకు కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అక్కడ ప్రజలు వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే. వ్యక్తిగత ఫ్యాషన్, అందానికి సంబంధించిన వాటిల్లో చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా రెడ్ లిప్‌స్టిక్‌ని పూర్తిగా బ్యాన్ చేసింది. మహిళలు ఎంతో ఇష్టంగా వేసుకునే రెడ్ లిప్‌స్టిక్‌ని ఉత్తర కొరియాలో మహిళలు వేసుకోకూడదు. అక్కడ దీన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. ఎందుకంటే ఎరుపు లిప్‌స్టిక్ వేసుకున్న మహిళలు అందర్నీ ఆకర్షిస్తారు, ఇది తమ దేశ నైతిక విలువలను మంటగలుపుతుందనేది అక్కడ వారి వాదన.
తమ దేశం సైద్ధాంతిక, సాంస్కృతికలతో బలంగా ముడి పడి ఉందని, ఇలాంటి ఫాషన్‌లు కారణంగా తమ దేశం విలువలు పడిపోతాయని అక్కడి అధికారులు చెబుతుండటం విశేషం. పైగా తమ ప్రభుత్వం సాంప్రదాయక, నిరాడంబర సౌందర్యాన్నే ప్రోత్సహిస్తుందని నర్మగర్భంగా చెబుతున్నారు అక్కడ అధికారులు. అందువల్ల అక్కడ ఉండే మహిళలు చాలా సింపుల్ సిటీని మెయింటెయిన్ చేయక తప్పనిస్థితి. అంతేగాదు అక్కడ మహిళలు తమ కళ్లు గప్పి ఆధునిక పోకడలను వంటబట్టించుకుని ఫ్యాషన్‌గా ఉంటున్నారేమోనని పార్టీ పెట్రోలింగ్ పేరుతో తనిఖీలు కూడా చేయిస్తుందట ఉత్తరకొరియా. ఒకవేళ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారికి తీవ్రమైన జరిమానాలు ఉంటాయి.
అలాగే కేశాలంకరణ విషయంలో కూడా కఠినమైన రూల్స్ ఉన్నాయి. జుట్టును పొడవుగా పెంచుకోవడం లేదా స్టైల్‌గా వదులుగా వదిలేయడం వంటివి అస్సలు చేయకూడదు. చిన్నగా అలంకరించుకోవచ్చు. కచ్చితంగా జుట్లుని అల్లుకోవాల్సిందే. అలాగే హెయిర్ కలరింగ్ వంటి ఆధునిక ఫ్యాషన్ స్టయిల్స్ ఏమీ ట్రై చేయకూదు. ఉత్తర కొరియా కేశాలంకరణకు సంబంధించి పురుషులకు(10), మహిళలు(18) కొన్ని ప్రామాణీకరించిన స్టయిల్స్ మంజూరు చేసింది. వాటినే ఫాలో అవ్వాల్సిందే.
(చదవండి: ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ నిజంగానే మంచివి కావా? శాస్త్రవేత్త లు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment