red lipstick
-
..................
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్ ఉన్ విచిత్రమైన పాలనా తీరుతో తరచు వార్తల్లో నిలుస్తుంటాడు. ఓ నియంతలా పాలిస్తుంటాడు. అర్థంకానీ నిబంధనలతో ప్రజలను కష్టపెడుతుంటాడన్న విషయంలో తెలిసిందే. అంతేగాదు మహిళల వ్యక్తిగత ఫ్యాషన్‌లో భయానక నిబంధనలను విధించాడు కిమ్. ఫ్యాషన్ ప్రపంచంలో మహిళలు ఎంతో ఇష్టపడు రెడ్ లిప్‌స్టిక్‌ని కూడా బ్యాన్ చేశాడంటే కిమ్ మామ ఆలోచన విధానం ఏంటో క్లియర్‌గా తెలుస్తుంది. కనీసం వారి వ్యక్తిగత అలకంరణ, ఫ్యాషన్ విషయాల్లో స్వేచ్ఛని కూడా లాగేసుకుంటే వామ్మో ఇదేం నాయకుడు రా బాబు అనిపిస్తుంది కదూ. అక్కడ ఫ్యాషన్ విషయంలో ప్రజలకు విధించిన ఆంక్షలు ఏంటో సవివరంగా చూద్దామా..!ఉత్తర కొరియాలో ధరించే దుస్తుల దగ్గరనుంచి అలకరణ వరకు కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అక్కడ ప్రజలు వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే. వ్యక్తిగత ఫ్యాషన్, అందానికి సంబంధించిన వాటిల్లో చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా రెడ్ లిప్‌స్టిక్‌ని పూర్తిగా బ్యాన్ చేసింది. మహిళలు ఎంతో ఇష్టంగా వేసుకుని రెడ్ లిప్‌స్టిక్‌ని ఉత్తర కొరియాలో మహిళలు వేసుకోకూడదు. అక్కడ దీన్ని బ్యాన్‌చేశారు. ఎందకంటే ఎరుపు లిప్‌స్టిక్ వేసుకున్న మహిళలు అందర్నీ ఆకర్షిస్తారు, ఇది తమ దేశ నైతిక విలువలను మంటగలుపుతుందనేది అక్కడ వారి వాదన. తమ దేశం సైద్ధాంతిక, సాంస్కృతికలతో బలంగా ముడి పడి ఉంది. ఇలాంటి ఫాషన్లు కారణంగా తమ దేశ విలువ పడిపోతున్నది వారి భయం. తమ ప్రభుత్వంసాంప్రదాయక, నిరాడంబర సౌందర్యాన్నే ప్రోత్సహిస్తుందని అక్కడ అధికారులు చెబుతున్నారు. అందువల్ల అక్కడ ఉండే మహిళలు చాలా సింపుల్ సిటీని మెయింటెయిన్ చేయక తప్పనిస్థితి. అంతేగాదు అక్కడ మహిళలు కళ్లు గప్పి ఆధునిక పోకడలను వంటబట్టించుకుని ఫ్యాషన్‌గా ఉంటున్నారేమోనని పార్టీ పెట్రోలింగ్ పేరుతో తనిఖీలు కూడా చేయిస్తుందట ఉత్తరకొరియా. ఒకవేళ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారికి తీవ్రమైన జరిమానాలు ఉంటాయి. అలాగే కేశాలంకరణ విషయంలో కూడా కఠినమైన రూల్స్ ఉన్నాయి. జుట్టును పొడవుగా పెంచుకోవడం లేదా స్టైల్‌గా వదులుగా వదిలేయడం వంటివి అస్సలు చేయకూడదు. చిన్నగా అలంకరించుకోవచ్చు. కచ్చితంగా జుట్లుని అల్లుకోవాల్సిందే. అలాగే హెయిర్ కలరింగ్ వంటి ఆధునిక ఫ్యాషన్ స్టయిల్స్ ఏమీ ట్రై చేయకూడాదు. ఉత్తర కొరియా కేశాలంకరణకు సంబంధించి పురుషులకు(10), మహిళలు(18) కొన్ని ప్రామాణీకరించిన స్టయిల్స్ మంజూరు చేసింది. వాటినే ఫాలో అవ్వవాల్సిందే. (చదవండి: ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ నిజంగానే మంచివి కావా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..) -
రెడ్ లిప్‌స్టిక్‌ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్ ఉన్ విచిత్రమైన పాలనా తీరుతో తరచు వార్తల్లో నిలుస్తుంటాడు. ఓ నియంతలా పాలిస్తుంటాడు. అర్థంకానీ నిబంధనలతో ప్రజలను కష్టపెడుతుంటాడన్న విషయంలో తెలిసిందే. అంతేగాదు మహిళల వ్యక్తిగత ఫ్యాషన్‌లో భయానక నిబంధనలను విధించాడు కిమ్. ఫ్యాషన్ ప్రపంచంలో మహిళలు ఎంతో ఇష్టపడే రెడ్ లిప్‌స్టిక్ కూడా బ్యాన్ చేశాడంటే కిమ్ మామ ఆలోచన విధానం ఏంటో క్లియర్‌గా తెలుస్తోంది. కనీసం వారి వ్యక్తిగత అలకంరణ, ఫ్యాషన్ విషయాల్లో స్వేచ్ఛని కూడా లాగేసుకుంటే వామ్మో ఇదేం నాయకుడు రా బాబు అనిపిస్తుంది కదూ. అక్కడ ఫ్యాషన్ విషయంలో ప్రజలకు విధించిన ఆంక్షలు ఏంటో సవివరంగా చూద్దామా..!ఉత్తర కొరియాలో ధరించే దుస్తుల దగ్గరనుంచి అలకరణ వరకు కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అక్కడ ప్రజలు వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే. వ్యక్తిగత ఫ్యాషన్, అందానికి సంబంధించిన వాటిల్లో చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా రెడ్ లిప్‌స్టిక్‌ని పూర్తిగా బ్యాన్ చేసింది. మహిళలు ఎంతో ఇష్టంగా వేసుకునే రెడ్ లిప్‌స్టిక్‌ని ఉత్తర కొరియాలో మహిళలు వేసుకోకూడదు. అక్కడ దీన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. ఎందుకంటే ఎరుపు లిప్‌స్టిక్ వేసుకున్న మహిళలు అందర్నీ ఆకర్షిస్తారు, ఇది తమ దేశ నైతిక విలువలను మంటగలుపుతుందనేది అక్కడ వారి వాదన. తమ దేశం సైద్ధాంతిక, సాంస్కృతికలతో బలంగా ముడి పడి ఉందని, ఇలాంటి ఫాషన్లు కారణంగా తమ దేశం విలువలు పడిపోతాయని అక్కడి అధికారులు చెబుతుండటం విశేషం. పైగా తమ ప్రభుత్వం సాంప్రదాయక, నిరాడంబర సౌందర్యాన్నే ప్రోత్సహిస్తుందని నర్మగర్భంగా చెబుతున్నారు అక్కడ అధికారులు. అందువల్ల అక్కడ ఉండే మహిళలు చాలా సింపుల్ సిటీని మెయింటెయిన్ చేయక తప్పనిస్థితి. అంతేగాదు అక్కడ మహిళలు తమ కళ్లు గప్పి ఆధునిక పోకడలను వంటబట్టించుకుని ఫ్యాషన్‌గా ఉంటున్నారేమోనని పార్టీ పెట్రోలింగ్ పేరుతో తనిఖీలు కూడా చేయిస్తుందట ఉత్తరకొరియా. ఒకవేళ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారికి తీవ్రమైన జరిమానాలు ఉంటాయి. అలాగే కేశాలంకరణ విషయంలో కూడా కఠినమైన రూల్స్ ఉన్నాయి. జుట్టును పొడవుగా పెంచుకోవడం లేదా స్టైల్‌గా వదులుగా వదిలేయడం వంటివి అస్సలు చేయకూడదు. చిన్నగా అలంకరించుకోవచ్చు. కచ్చితంగా జుట్లుని అల్లుకోవాల్సిందే. అలాగే హెయిర్ కలరింగ్ వంటి ఆధునిక ఫ్యాషన్ స్టయిల్స్ ఏమీ ట్రై చేయకూదు. ఉత్తర కొరియా కేశాలంకరణకు సంబంధించి పురుషులకు(10), మహిళలు(18) కొన్ని ప్రామాణీకరించిన స్టయిల్స్ మంజూరు చేసింది. వాటినే ఫాలో అవ్వాల్సిందే. (చదవండి: ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ నిజంగానే మంచివి కావా? శాస్త్రవేత్త లు ఏమంటున్నారంటే..) -
అందమైన అధరాల కోసం 3డీ రెడ్ లిప్‌స్టిక్
లండన్: `లిప్‌స్టిక్` అనగానే గుర్తుచ్చేది అమ్మాయి అందమైన అధరాలు. ఆ అమ్మాయి అధరాలకు కాస్తా లిప్ స్టిక్ తోడైతే ఆమె అందానికి మరింత అందం తెచ్చిపెడుతుంది. చక్కని ముద్దుగుమ్మ లేతపెదవలపై ఎర్రటి రంగు లిప్ స్టిక్ చూస్తే ఎంతటివారైనా చూపుతిప్పుకోవటం కష్టమే మరీ. అయితే మహిళల అలంకరణ వస్తువుల్లో లిప్ స్టిక్ ది తొలిస్థానమనే చెప్పాలి. అతివలు తమ అందం కోసం ఎంతగా మేకప్ చేసుకొన్నా చివరికి పూర్తి అయ్యేది లిప్ స్టిక్ తోనే మరీ. అతివల మదిని దోచుకునే ఎన్నో లిప్ స్టిక్ లు ప్రస్తుత మార్కెట్లో విభన్నరీతిలో లభ్యమవుతున్నాయి. వీటిన్నింటికీ భిన్నంగా అమ్మాయిలను మరింత అందంగా చూపించేందుకు మరో సరికొత్త లిప్ స్టిక్ అందుబాటులోకి వచ్చింది. అదే `3డీ రెడ్ లిప్‌స్టిక్`. సాధారణంగా అమ్మాయిలందరూ తమ అధరాలను అందంగా తీర్చిదిద్దేందుకు లిప్ స్టిక్, లిప్ గ్లాస్ వంటి వాడుతుంటారు. వివిధ ఫంక్షన్లు, మరియు చాలా ఈవెంట్స్ లలో చాలా మంది సెలబ్రెటీ రెడ్ లిప్ స్టిక్ వేసుకొని ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. కానీ 3డీ రెడ్ లిప్‌స్టిక్ వేసుకున్న మహిళలు ఇంకా అందంగా కనిపించేలా ఇందులో మూడు రకాల షేడ్స్ ఉన్నాయి. దీంతో వారి పెదవులు త్రిడీ లూక్ లో ప్రకాశిస్తాయి. అయితే ఈ రెడ్ లిప్ స్టిక్ ను సరైన పద్దతిలో మేకప్ వేసుకున్నట్టయితే ఎంతో అందంగా కనిపిస్తారు. ఈ రెడ్ లిప్ స్టిక్ మొదట పెదవుల మధ్య పొరపై సున్నితంగా రాసి, ఆపై పెదవుల అంచులలో డార్క్ గా మేకప్ వేసినట్టయితే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయని ఫిమేల్స్ ఫస్ట్. కో. యుకె నివేదించింది. ఒకే రంగుతో పెదవులకు ఈ రెడ్ లిప్ స్టిక్ వేసుకున్నసరే ఇంకా ఆకర్ణణీయంగా కనిపిస్తుందని పేర్కొంది. ఎందుకంటే ఈ రెడ్ లిప్ స్టిక్ వేసుకొనే విధానంలో కొన్ని ట్రిక్స్ తెలుసుకొన్నట్లైతే మీరు అందంగా కనబడేలా చేయడానికి సహాయపడుతుంది. అంతేకాక లిప్ స్టిక్ వేసుకొన్నా మీరు సౌకర్యవంతంగా ఫీలవుతారని చెబుతోంది. ఈ రెడ్ లిప్ స్టిక్ ను వేసుకునే ముందు కొన్నిటిప్స్ అనుసరిస్తే చాలంటున్నారు నిపుణులు. ఏదైనా పాత బ్రష్ తో ముందుగా పెదవులపై పొడి లేకుండా తేమ వచ్చేవరకూ రుద్దాలి. లేత రంగులోకి వచ్చిన తరువాత పెదవులపై ఆ లిప్ స్టిక్ బ్రష్ తో అద్దాలి. మొదట పొరపై, రెండవ పొరపై సరైన రంగువచ్చేవరకూ బ్రష్ తో రుద్దాలి. అప్పడు త్రిడీ లూక్ తో అందంగా మెరిసే పెదవులు మీ సొంతమైనట్టే.