ఉక్రెయిన్‌లోకి ఉత్తర కొరియా సైనికులు! అమెరికా వార్నింగ్‌ | US Warns North Korea Over Troops Who Enter Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లోకి ఉత్తర కొరియా సైనికులు! అమెరికా వార్నింగ్‌

Published Thu, Oct 31 2024 10:08 AM | Last Updated on Thu, Oct 31 2024 10:39 AM

US Warns North Korea Over Troops Who Enter Ukraine

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు మద్దతుగా ఉత్తరకోరియా సైనికులు  ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లు వార్తలు వస్తున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. రష్యాతో పాటు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు వెళ్లిన ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయని అమెరికా ఉత్తరకొరియాకు వార్నింగ్‌ ఇచ్చింది.

‘‘రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే.. కచ్చితంగా ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయి.కాబట్టి అటువంటి నిర్లక్ష్య, ప్రమాదకరమైన చర్యలకు పాల్పటం ఒకటికి రెండుసార్లు ఆలోచించమని నేను ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్-ఉన్‌కు సలహా ఇస్తాను’’ అని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్‌ వుడ్‌ అన్నారు.

చదవండి: ఉక్రెయిన్‌పై దాడులు.. పుతిన్‌ దళంలోకి ‘కిమ్‌’ సైన్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement