మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లకు పైగా సాగుతున్న దాడుల్లో రెండు దేశాల సైన్యం వీరోచితంగా పోరాడుతూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఎంతో మంది చనిపోయారు. ఈ పోరులో ఉక్రెయిన్ సైన్యం.. రష్యా భూభాగంలో అడుగుపెట్టింది. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకు వచ్చాయి. మరోవైపు.. రష్యాకు సాయం చేసేందుకు ఉత్తర కొరియా బలగాలు రంగంలోకి దిగాయి.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా నాటో వెల్లడించింది. ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కిమ్ బలగాలను మోహరించినట్లు నాటో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మీడియాకు తెలిపారు. ఇక, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇది రెండు మధ్య యుద్ధాన్ని మరింత ప్రోత్సహిస్తుందని అన్నారు.
NATO confirms North Korean troops have been sent to Russia to support its war in Ukraine. This marks a dangerous escalation, violating UN resolutions and risking global security. As Putin turns to Pyongyang for military aid, democracies must unite to uphold peace and security.… pic.twitter.com/kHT1g57y68
— Pete (@splendid_pete) October 28, 2024
ఇదిలా ఉండగా.. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే పుతిన్.. ఉక్రెయిన్‌పై పోరుకు నార్త్ కొరియా సాయం కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. అందులో భాగంగానే ఉత్తర కొరియా సైన్యం రష్యాకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కొద్ది రోజుల క్రితమే ఉత్తర కొరియా సైన్యంలోకి భారీగా యువత వచ్చి చేరారు.
మరోవైపు.. రష్యాలోకి కిమ్ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందో అనే చర్చ కూడా జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment