కీవ్:రష్యా తరపున యుద్ధం చేసేందుకు వచ్చిన ఉత్తరకొరియా(NorthKorea) సైనికులపై ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి స్పందించారు. ఉత్తర కొరియా సైనికులకు కనీస రక్షణ సౌకర్యాలు కల్పించకుండా రష్యా వారిని యుద్ధరంగంలోకి దించిందని జెలెన్‌స్కీ ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతూ గాయపడిన కొందరు ఉత్తర కొరియా సైనికులను తమ సైన్యం బంధించిందని,అయితే ఆ తర్వాత వారు చనిపోయారని తెలిపారు.
తీవ్రంగా గాయపడిన ఉత్తరకొరియా సైనికులను తాము కాపాడలేకపోయామని జెలెన్‌స్కీ చెప్పారు. ఉత్తర కొరియా సైనికుడొకరు ఉకక్రెయిన్‌కు బందీగా చిక్కారని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించిన కొద్ది సేపటికే జెలెన్‌స్కీ స్పందించడం గమనార్హం.ఎంత మంది ఉత్తరకొరియా సైనికులు తమకు చిక్కి చనిపోయారన్నది మాత్రం జెలెన్ స్కీ వెల్లడించలేదు.
సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ తెలిపిన దాని ప్రకారం దాదాపు వెయయ్యి మంది దాకా ఉత్తరకొరియా సైనికులు ఉక్రెయిన్ చేతిలో చనిపోయారని తెలుస్తోంది. మొత్తం 3వేల మంది దాకా ఉత్తరకొరియా సైనికులు తమతో యుద్ధంలో పాల్గొని మరణించారని జెలెన్‌స్కీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment