కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు తిరుమలవాసుడి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ విజయవాడ స్వరాజ్యమైదానంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరుడి నమూనా ఆలయంలో ఆదివారం ఉదయం పూజలు మొదలయ్యాయి. అనంతరం వెంకన్న దర్శనం ప్రారంభమైంది. కంచిస్వామి జయేంద్ర సరస్వతి నమూనా దేవాలయాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి డి.సాంబశివరావు మాట్లాడుతూ.. నిత్యం లక్షమంది స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. తిరుమల తరహాలో ప్రతిరోజూ అర్చనలు, శ్రీవారి సేవలు నిర్వహిస్తామని, పుష్కరాల్లో 12లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనావేసి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 12వ తేదీ నుంచి రోజూ సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించి కృష్ణవేణికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. 7 గంటలకు ఊంజల్ సేవ, గాత్ర సంగీత సభలు నిర్వహిస్తారు. అమరావతి, అలంపురం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
బెజవాడలో శ్రీవారి దర్శనం ప్రారంభం
Published Sun, Aug 7 2016 5:28 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
Advertisement