D. sambasiva rao
-
బెజవాడలో శ్రీవారి దర్శనం ప్రారంభం
కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు తిరుమలవాసుడి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ విజయవాడ స్వరాజ్యమైదానంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరుడి నమూనా ఆలయంలో ఆదివారం ఉదయం పూజలు మొదలయ్యాయి. అనంతరం వెంకన్న దర్శనం ప్రారంభమైంది. కంచిస్వామి జయేంద్ర సరస్వతి నమూనా దేవాలయాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి డి.సాంబశివరావు మాట్లాడుతూ.. నిత్యం లక్షమంది స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. తిరుమల తరహాలో ప్రతిరోజూ అర్చనలు, శ్రీవారి సేవలు నిర్వహిస్తామని, పుష్కరాల్లో 12లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనావేసి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 12వ తేదీ నుంచి రోజూ సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించి కృష్ణవేణికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. 7 గంటలకు ఊంజల్ సేవ, గాత్ర సంగీత సభలు నిర్వహిస్తారు. అమరావతి, అలంపురం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. -
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించా
- కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తిరుమల: దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని తమిళనాడులోని కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయ అనంతరం ఆలయానికి వచ్చిన పీఠాధిపతికి ఆలయ అధికారులు ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా అర్చకులు జయేంద్ర సరస్వతిని వస్త్రంతో సత్కరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతికి టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ప్రత్యేక మర్యాదలు చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం జయేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ మహిమాన్వితమైన శ్రీవేంకటేశ్వరుడుని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. వారి వెంట ఆలయ డెప్యూటీ ఈవో కోదండ రామారావు, బోర్డు సభ్యులు పసుపులేటి హరిప్రసాద్, కృష్ణమూర్తి ఉన్నారు. -
టీటీడీ ఈవోగా సాంబశివరావు
ఎంజీ గోపాల్ తెలంగాణకు బదిలీ సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యనిర్వహణ అధికారి ఎంజీ.గోపాల్‌ను ప్రభుత్వం తెలంగాణకు బదిలీ చేసింది. పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.సాంబశివరావును టీటీడీ ఈవోగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఎంజీ.గోపాల్ టీటీడీ ఈవోగా జూలై 6, 2013న నియమితులయ్యారు. ఏడాదిన్నరపాటు ఈవోగా పనిచేసిన ఆయన టీటీడీలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. శ్రీవారి దర్శనంలో సమూలమైన మార్పు లుతెచ్చారు. దర్శనంలో మూడు వరుసల విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.300ల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో విక్రయించే విధానానికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో కీలకభూమిక పోషించారు. ఐఏ ఎస్‌ల విభజనలో ప్రత్యూష కమిటీ ఎంజీ.గోపాల్‌ను తెలంగాణకు కేటాయిం చింది. ఆయన్ను తెలంగాణ కేడర్‌కు కేటాయించడంతో ప్రభుత్వం బదిలీ చేసింది. గిరిధర్‌ను తెలంగాణకు కేటాయించినప్పటి నుంచి టీటీడీ ఈవో పదవిని దక్కించుకోవడానికి పలువురు ఐఏఎస్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. సీఎంవో కార్యదర్శిగా పనిచేస్తోన్న 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎ.గిరిధర్‌ను టీటీడీ ఈవోగా నియమిస్తారని అప్పట్లో అధికారవర్గాలు వెల్లడించాయి. కానీ.. పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.సాంబశివరావును టీటీడీ ఈవోగా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. 1986 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన డి.సాంబశివరావుకు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే సాంబ శివరావుకు గాడితప్పిన టీటీడీని గాడిలో పెట్టే సత్తా ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఏపీ మెట్రో ప్రాజెక్టులకు ముఖ్య సలహాదారుగా శ్రీధరన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో ప్రతిపాదిత మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఎంఆర్టీఎస్) ప్రాజెక్టుకు ముఖ్య సలహాదారుగా ఇ.శ్రీధరన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఆర్టీఎస్ కింద విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసేందుకు శ్రీధరన్ సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనకు సెప్టెంబర్ 1 నుంచే గౌరవ వేతనం కింద నెలకు రూ. 1.50 లక్షలు ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో శ్రీధరన్ ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ ప్రాజెక్టు బాధ్యతలు నిర్వర్తించిన విషయం విదితమే. -
3,025 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 3,025 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి డి.సాంబశివరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా డెరైక్ట రిక్రూట్మెంట్ ద్వారా 287 పోస్టులను, డిపార్టమెంట్ ఎంపిక కమిటీల ద్వారా 1,462 పోస్టులను, జిల్లా ఎంపిక కమిటీల ద్వారా 1,276 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టులు: పౌరసరఫరాల శాఖలో సీనియర్ అసిస్టెంట్-1, సాధారణ పరిపాలన శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స-50, చేనేత జౌళి శాఖలో అసిస్టెంట్ డెరైక్టర్‌స-12, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్‌లో జూనియర్ స్టెనోగ్రాఫర్-1, అసెంబ్లీ సచివాలయంలో అదనపు రేడియో అసిస్టెంట్ ఇంజనీర్-1, అదనపు రేడియో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-1,అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స-10, క్లాసిఫయర్-1, లెజిస్లేటివ్ ఆఫీసర్స-15, రీసెర్చ అసిస్టెంట్-1, రీసెర్చ ఆఫీసర్-11, ఉర్దూ రిపోర్టర్-1, కార్మిక శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్-18, విశాఖ పరిశ్రమల ట్రిబ్యునల్ అండ్ లేబర్ కోర్టులో సీనియర్ టైపిస్ట-1, మున్సిపల్ శాఖలో బిల్ కలెక్టర్లు-46, రెవెన్యూ ఆఫీసర్లు-15, ప్రజారోగ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-4, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (గ్రేడ్-3)-46, అర్థగణాంక డెరైక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్స-11, సీనియర్ అసిస్టెంట్స-4, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సబ్ రిజిస్ట్రార్స (గ్రేడ్-2)-24, డెరైక్టరేట్ పబ్లిక్ లైబ్రరీస్‌లో జూనియర్ అసిస్టెంట్స-3, గిరిజన సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్స-5, సాంఘిక సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్స-4. డిపార్టమెంటల్ ఎంపిక కమిటీల ద్వారా: ఏపీసీపీడీసీఎల్‌లో అసిస్టెంట్ ఇంజనీర్స-51, అంబేద్కర్ యూనివర్సిటీ (శ్రీకాకుళం)లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు-15, ఆచార్య నాగార్జున వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు-38, అసోసియేట్ ప్రొఫెసర్లు-23, ప్రొఫెసర్లు-7, ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు-119, అసిస్టెంట్ ప్రొఫెసర్లు-200, అసోసియేట్ ప్రొఫెసర్లు-128, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు-110, అసోసియేట్ ప్రొఫెసర్లు-95, ప్రొఫెసర్లు-63, ఖాదీ గ్రామీణ పరిశ్రమ మండలిలో క్రాఫ్ట టీచర్లు-6, లెక్చరర్లు-3, ఆర్టీసీలో డిప్యూటీ సూపరింటెండెంట్-72, జూనియర్ అసిస్టెంట్ (ఎఫ్)-92, జూనియర్ అసిస్టెంట్ (పి)-89, మెకానికల్ సూపర్వైజర్-182, ట్రాఫిక్ సూపర్వైజర్-169 జిల్లా ఎంపిక కమిటీ ద్వారా: మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని పాఠశాలల్లో లాంగ్వేజ్ పండిట్స-198, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స-34, స్కూల్ అసిస్టెంట్స-126, స్కూల్ అసిస్టెంట్స (లాంగ్వేజ్)-64, సెకండరీ గ్రేడ్ టీచర్లు-854.