సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 3,025 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి డి.సాంబశివరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా డెరైక్‌ట రిక్రూట్‌మెంట్ ద్వారా 287 పోస్టులను, డిపార్‌టమెంట్ ఎంపిక కమిటీల ద్వారా 1,462 పోస్టులను, జిల్లా ఎంపిక కమిటీల ద్వారా 1,276 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది.
ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టులు: పౌరసరఫరాల శాఖలో సీనియర్ అసిస్టెంట్-1, సాధారణ పరిపాలన శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌స-50, చేనేత జౌళి శాఖలో అసిస్టెంట్ డెరైక్టర్‌స-12, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్‌లో జూనియర్ స్టెనోగ్రాఫర్-1, అసెంబ్లీ సచివాలయంలో అదనపు రేడియో అసిస్టెంట్ ఇంజనీర్-1, అదనపు రేడియో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-1,అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌స-10, క్లాసిఫయర్-1, లెజిస్లేటివ్ ఆఫీసర్‌స-15, రీసెర్‌చ అసిస్టెంట్-1, రీసెర్‌చ ఆఫీసర్-11, ఉర్దూ రిపోర్టర్-1, కార్మిక శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్-18, విశాఖ పరిశ్రమల ట్రిబ్యునల్ అండ్ లేబర్ కోర్టులో సీనియర్ టైపిస్‌ట-1, మున్సిపల్ శాఖలో బిల్ కలెక్టర్లు-46, రెవెన్యూ ఆఫీసర్లు-15, ప్రజారోగ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-4, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (గ్రేడ్-3)-46, అర్థగణాంక డెరైక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌స-11, సీనియర్ అసిస్టెంట్‌స-4, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సబ్ రిజిస్ట్రార్‌స (గ్రేడ్-2)-24, డెరైక్టరేట్ పబ్లిక్ లైబ్రరీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌స-3, గిరిజన సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌స-5, సాంఘిక సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌స-4.
డిపార్‌టమెంటల్ ఎంపిక కమిటీల ద్వారా: ఏపీసీపీడీసీఎల్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌స-51, అంబేద్కర్ యూనివర్సిటీ (శ్రీకాకుళం)లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు-15, ఆచార్య నాగార్జున వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు-38, అసోసియేట్ ప్రొఫెసర్లు-23, ప్రొఫెసర్లు-7, ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు-119, అసిస్టెంట్ ప్రొఫెసర్లు-200, అసోసియేట్ ప్రొఫెసర్లు-128, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు-110, అసోసియేట్ ప్రొఫెసర్లు-95, ప్రొఫెసర్లు-63, ఖాదీ గ్రామీణ పరిశ్రమ మండలిలో క్రాఫ్‌ట టీచర్లు-6, లెక్చరర్లు-3, ఆర్టీసీలో డిప్యూటీ సూపరింటెండెంట్-72, జూనియర్ అసిస్టెంట్ (ఎఫ్)-92, జూనియర్ అసిస్టెంట్ (పి)-89, మెకానికల్ సూపర్‌వైజర్-182, ట్రాఫిక్ సూపర్‌వైజర్-169
జిల్లా ఎంపిక కమిటీ ద్వారా: మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని పాఠశాలల్లో లాంగ్వేజ్ పండిట్‌స-198, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌స-34, స్కూల్ అసిస్టెంట్‌స-126, స్కూల్ అసిస్టెంట్‌స (లాంగ్వేజ్)-64, సెకండరీ గ్రేడ్ టీచర్లు-854.
3,025 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Published Tue, Oct 1 2013 12:48 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement